Ramcharan tej s bike going to be auctioned

govindudu andarivadele, govindudu andarivadele images, govindudu andarivadele audio, govindudu andarivadele latest, govindudu andarivadele audio songs free download, govindudu andarivadele songs free download, govindudu andarivadele byke, govindudu andarivadele ramcharan photos, govindudu andarivadele release date, govindudu andarivadele review, govindudu andarivadele movie review, balakrishna, legend, balakrishna movies, balakrisnha byke, legend bike, tollywood, latest news

ram charan tej famous actor in telugu film industry fallowing balakrishna's trend in bike using and selling : same as balakrishna used and auctioned his customised byke ram charan also going to auction his bike of govindudu andarivadele

బాలయ్యను చూసి నేర్చుకుంటున్న చరణ్

Posted: 09/20/2014 11:59 AM IST
Ramcharan tej s bike going to be auctioned

‘‘సీనియర్లు చెప్పినట్లు జూనియర్లు వినాలి.., సీనియర్లను చూసి నేర్చుకోవాలి’’. ఈ సినిమా డైలాగులను రామ్ చరణ్ తేజ్ పాటిస్తున్నాడు. ప్రస్తుతం చరణ్ చేస్తున్నది చూస్తే ఇదే నిజమని తెలుస్తుంది. సినిమాలో బైక్ విషయంలో చెర్రి, లెజెండ్ ని ఫాలో అవుతున్నాడు. లెజెండ్ సినిమాలో బాలకృష్ణ ప్రత్యేకంగా డిజైన్ చేసిన బైక్ ఉపయోగించాడు. సినిమా విడుదల అయ్యాక ఈ బైక్ ను రాష్ర్టమంతా ప్రదర్శించి.., చివరకు వేలం వేశారు. ఫలితంగా వచ్చిన డబ్బును.., బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి అందించారు.

ఇప్పుడు ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో కూడా చరణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించిన హార్లే డేవిడ్ సన్ కంపనీ బైకును ఉపయోగిస్తున్నాడు. ఈ బైకును కూడా సినిమా విడుదల తర్వాత వేలం వేస్తారని తెలుస్తోంది. వేలంలో వచ్చిన డబ్బును ఓ ఛారిటీకి అందిస్తారని సినిమా యూనిట్ వర్గాలు అంటున్నాయి. బైక్ విషయంలో బాలకృష్ణకు, లెజెండ్ సినిమాకు బాగా పబ్లిసిటీ రావటంతో.., ఇదే పంధాను చరణ్ కూడా కొనసాగిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే.., ఇటీవలే ఆడియో విడుదల కాగా పాటలకు మంచి స్పందన వస్తోంది.

సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. రోజుకు రెండు షిప్టుల్లో పని జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా రెండు పాటలు పూర్తి చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. దసరా సెలవుల సమయంలో విడుదల చేస్తుండటంతో.., తొలివారం కలెక్షన్లకు తిరుగు ఉండదని కూడా డిస్ర్టిబ్యూటర్లు భావిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రితో కాజల్ అగర్వాల్ నటిస్తోంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  govindudu andarivadele  bike  latest news  

Other Articles