Deepika padukone comments on women beauty in social media

deepika padukone, deepika padukone latest news, deepika padukone social media, deepika padukone finding fanny movie, finding fanny movie news, deepika padukone hot photo shoot, deepika padukone fires on social media

deepika padukone comments on women beauty in social media : the bollywood star actress deepika padukone comments on women beauty in social media.

స్త్రీలు వుండేది అందాలు చూపించడానికే!

Posted: 09/15/2014 10:59 AM IST
Deepika padukone comments on women beauty in social media

ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న దీపికా పదుకొనే... ఈమధ్య సినిమాల్లోనే కాకుండా సదరు మూవీ ప్రమోషన్లలో భాగంగా చక్కర్లు కొడుతూ పొట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని అందాలను ఆరబోస్తున్న విషయం అందిరీక తెలిసిందే! ఈ హాట్ సుందరి ఎక్కడికివెళ్లినా.. తన గ్లామర్ మొత్తం కనిపించేలా డ్రెస్సులు వేసుకుని మీడియా అటెన్షన్ కొట్టేస్తోంది. దీంతో ఈ అమ్మడిపై రకరకాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు చేతినిండా సినిమాలు వుండటమే కాకుండా.. స్టార్ డమ్ కూడా వున్న ఈ అమ్మడు ఎందుకిలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని అందరూ ప్రశ్నించడం మొదలుపెట్టేశారు. ఎంత సెక్సీ హీరోయిన్ అయితే ఏంటి..? మరీ ఇంతలా పబ్లిక్ లో కూడా బరితెగించాలా..? అంటూ ఎవరికివారు పెదవి విరిచేశారు. ఈ విషయం అలా ఈ ముద్దుగుమ్మ చెవికి చేరిపోయింది. దీంతో తీవ్రఆగ్రహానికి గురైన ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో నిప్పులు చెరిగింది.

‘‘స్త్రీలు అంటేనే సౌందర్యం... సౌందర్యం వుండేది చూపించడానికి... అందుకే కావాలనే నాలో వున్న గ్లామర్ ను పబ్లిక్ లో కూడా చూపించాను. అలా అందాన్ని చూపించడం ఏమైనా తప్పా..?’’ అంటూ ఎదురు ప్రశ్న వేసి అందరినీ సందేహాల్లో ముంచెత్తింది ఈ భామ! దీపికా తాజాగా నటించిన ‘‘ఫైండింగ్ ఫెనీ’’ మూవీలో తన అందాలను ఆరబోయడంతోపాటు ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా వెళ్లిన ప్రతిచోటా తన సౌందర్యాన్ని బరితెగించి చూపించేసింది. దాంతో మీడియాతోపాటు సినీప్రముఖులు సైతం ఈమెపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు.. అందాలు వున్నదే చూపించడానికి.. అందుకే తాను కావాలనే చూపించానంటూ గుర్రుగా పేర్కొంటోంది. అంటే.. ఈమె చెప్పిన దాన్ని గమనిస్తే.. అందాలను చూపించేవారిక తప్పు లేదు గానీ.. చూసేవారిదే తప్పన్నమాటంటూ సెటైర్లు వేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : deepika padukone  women beauty  finding fanny movie  bollywood celebrities  

Other Articles