Director rajamouli twitter comments on shweta basu prasad prostitution case

rajamouli, rajamouli latest news, rajamouli twitter, shweta basu prasad news, shweta basu prasad prostitution, shweta basu prasad news, sakshi tanwar, sakshi tanwar hot photos, rajamouli sakshi tanwar, rajamouli shweta basu prasad

director rajamouli twitter comments on shweta basu prasad prostitution case

శ్వేత వ్యవహారంలో జోస్యం పలికిన జక్కన్న పిట్ట!

Posted: 09/10/2014 06:05 PM IST
Director rajamouli twitter comments on shweta basu prasad prostitution case

ఇటీవలే వ్యభిచారంలో పట్టుబడ్డ శ్వేతబసు వ్యవహారం రానురాను చిత్రపరిశ్రమలో తారాస్థాయికి చేరిపోయినట్టు తెలుస్తోంది. అటు బాలీవుడ్ లో కొంతమంది కొత్త నాయికలు ఈమెపై పెదవి విరిస్తే.. మరికొంతమంది మద్దతుగా వ్యాఖ్యానాలు చేశారు. ఈ కేసులో కేవలం ఈమెను మాత్రమే హైలైట్ చేసి, ఈమెతోపాటు పట్టబడ్డవారిని వదిలేయడంపై  చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో శ్వేతను అమాయకురాలిగా చేసి.. ఆమెతోపాటు వున్న వ్యక్తుల వివరాలు బయటకు రానీయకుండా పోలీసులు పెద్ద వ్యూహమే రచిస్తున్నారని.. మీడియా కూడా చాలా దుష్ప్రచారం చేస్తోందని కొంతమంది సెలబ్రిటీలు తమ గళం విప్పారు.

ఇదే విషయంపై ప్రముఖ హిందీ టీవీ నటి సాక్షి తన్వర్ కూడా స్పందించింది. గతంలో ‘‘కహానీ ఘర్ ఘర్’’ టీవీ సీరియల్ లో శ్వేతబసుకు తల్లిగా సాక్షి నటించింది. దాంతో వారిమధ్య వున్న ఈ సాన్నిహిత్య కారణంతో ఆమె ప్రస్తుతం రెస్క్యూ హోమ్ లో వున్న శ్వేతబసును కలవడానికి ప్రయత్నించిందని.. అయితే అక్కడ వెళ్లడానికి ఆమెను అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆమె శ్వేతకు మద్దతుగా కొన్ని ప్రశ్నలకు లేవనెత్తింది. ‘‘వ్యభిచారంలో పట్టుబడిందని కేవలం శ్వేతను మాత్రమే బలిపశువును చేశారు కానీ.. ఆమెతోపాటు పట్టుడిన బిజినెస్ మెన్ ను ఎందుకు వదిలేశారంటూ’’ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో పోలీసుల కుట్ర కూడా వుందని, అందుకే అతని పేరు బయటపెట్టడం లేదని ఆమె అభిప్రాయపడింది.

‘‘రిమాండ్ హౌజ్ లో వున్న శ్వేతను ఆమె తల్లి కలవడానికి వెళ్లగా, అందుకు అధికారులు నిరాకరించారని... ఈ విషయంలో తల్లి పడుతున్న ఆవేదనను ఎవరు పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటని’’ ఆమె పేర్కొంది. ఇలాంటి కేసుల్లో అరెస్టయిన వారి పేర్లను (అమ్మాయిల పేర్లను) గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత పోలీసులు విస్మరించారని, శ్వేతాబసు పేరు మాత్రం తెలిపిన వారు అందులో పట్టుబడ్డ ఆ వ్యాపారి పేరును మాత్రం ఇప్పటికీ ఎందుకు గోప్యంగానే ఉంచారంటూ ధ్వజమెత్తింది. మీడియాలో వచ్చిన కథనాలకు మనస్తాపం చెంది ఒకవేళ ఆమె ఎలాంటి అఘాయిత్యానికైనా పాల్పడితే, దానికి ఎవరూ బాధ్యత వహిస్తారు..?’’ అంటూ ఆమె ప్రశ్నోత్తరాలను జారీ చేసింది.

సాక్షి తన్వర్ సంధించిన ఈ ప్రశ్నలకు మద్దతుగా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కూడా మద్దతు పలికాడు. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాల్సిందేనంటూ ఆయన తన ట్విటర్ లో పోస్ట్ చేశాడు. ఈయనతోపాటు మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా ఆమెకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ కేసు విషయంలో శ్వేత పేరును మాత్రమే బయటపెట్టి.. ఆమెతోపాటు పట్టుబడిన వారి పేర్లను హైలైట్ చేయకపోవడం వెనుక ఏదో ఆంతర్యం వుండొచ్చని రాజమౌళి భావించి వుండవచ్చు.

A

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : director rajamouli  shweta basu prasad  sakshi tanwar  twitter  prostitution  

Other Articles