New angle sweta basu prasad prostitution

sweta basu prasad, prostitution, hyderabad police raid, sweta basu prasad prostitution, sweta basu prasad movies, sweta basu prasad photo exhibition, jalaluddin mahammad rumi, writer jalaluddin mahammad rumi, sweta basu prasad latest news, sweta basu prasad rescue home

new angle sweta basu prasad prostitution : A new angle revealed in sweta basu prasad life that she is a photographer and fan of the best writer rumi

శ్వేతబసు విషయంలో బయటపడ్డ మరో రహస్య కోణం!

Posted: 09/08/2014 11:40 AM IST
New angle sweta basu prasad prostitution

(Image source from: new angle sweta basu prasad prostitution)

వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ శ్వేతబసు ప్రసాద్ విషయంలో రానురాను రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ రొంపిలో ఈమెతోపాటు పలు హీరోయిన్లు, బడాబాబులు కూడా వున్నారనే విషయం బయటపడిన నేపథ్యంలో.. ఆ కోణంపై పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంత చేశారు. త్వరలోనే వారి విషయాలను కూడా బట్టబయలు చేయనున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇదిలావుండగా.. శ్వేతబసుకు సంబంధించి ఎవరూ ఊహించని ఒక రహస్య కోణం తాజాగా వెల్లడయ్యింది.

చిన్నవయస్సులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపుతోపాటు జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఈ అమ్మడు... ఒక మంచి ఫోటోగ్రాఫర్ అనే విషయం ఇప్పుడిప్పుడే బయటపడింది. అంతేకాదు.. ఆమె ప్రసిద్ధ కవి రూమీ అభిమాని కూడా! ‘‘మనం చనిపోయాక భూమిలోని సమాధిలో కాకుండా జనం గుండెల్లో నిలువాలి’’ అంటూ రచించిన సుప్రసిద్ద సూఫీ కవి రూమీ ఫిలాసఫికి శ్వేతాబసు ఆకర్షితులయిన శ్వేత.. ఆయనకు వీరభక్తురాలిగా మారిపోయింది. జలాలుద్దీన్ మహమ్మద్ రూమీ ఒక పర్షియన్ కవి. ఆయన రచనలు పలు భాషల్లోకి అనువాదమయ్యాయి. అమెరికాలో ఇప్పటికీ సాహితీ ప్రేమికులు ఆయనను పాపులర్ రచయితగా భావిస్తారు. ఆయన రచించిన కొన్ని రచనలు బెస్ట్ సెల్లర్ గా వున్నాయి కూడా!

అటువంటి కవికి ముగ్ధులైన శ్వేత.. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా పేదరికం, ప్రకృతి, సమాజానికి కనిపించని ఇతర అంశాలను తన కెమెరాలో బంధించి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది. ఆయన రచనలతోపాటు మంచి ఆశయం, సిద్ధాంతాలను శ్వేత నిత్యం ఆచరించేది. అయితే.. తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుని చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిపోదామనుకున్న శ్వేతకు.. సినిమా ప్రపంచం ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఏ ప్రపంచంలో అయితే తన మంచి ప్రతిభతో ప్రశంసలను అందుకుందో.. అదే ఆమెను మురికి కంపులోకి కూరుకుపోయేలా చేసింది.

ఇదిలావుండగా... అవకాశాలు సరిగ్గా లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కున్న శ్వేతకు తప్పని పరిస్థితుల్లో ఇలా వ్యభిచారంలో రావాల్సి వచ్చిందని పేర్కొన్న శ్వేతబసుకు.. అనేక వర్గాలనుంచి సానుభూతి, సానుకూలత వ్యక్తమవుతోంది. ఈ కేసులో కేవలం శ్వేతబసును బలపీఠం ఎక్కించడంపై అన్నిరంగాల నుంచి నిరసనలు వస్తున్నాయి. ఈ కేసులో శ్వేతతోపాటు పట్టుబడిన ఇతర వ్యక్తుల పేర్లను, ఫోటోలను బయటపెట్టాల్సిందిగా డిమాండ్లు వస్తున్నాయి. దీంతో వారి పేర్లను బహిర్గతం చేసే అంశంపై ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles