Renu desai posted about pawan kalyan on facebook

pawan kalyan, renu desai, renu desai latest news, pawan kalyan facebook, pawan kalyan twitter, pawan kalyan janasena, pawan kalyan renu desai news, pawan kalyan news, renu desai facebook

renu desai posted about pawan kalyan on facebook : renu desai posted about pawan kalyan on facebook that pawan is good teacher

పవన్ కు వీరభక్తురాలిగా మారిన రేణుదేశాయ్

Posted: 09/01/2014 04:33 PM IST
Renu desai posted about pawan kalyan on facebook

(Image source from: renu desai posted about pawan kalyan on facebook)

టాలీవుడ్ పవర్ స్టార్-జనసేనాధిపతి పవర్ కల్యాణ్, రేణుదేశాయ్ లు విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ తమ మధ్య ఇప్పటికీ మంచి సంబంధమే వుందంటూ రేణు ఫేస్ బుక్ ద్వారా విశదీకరించింది. తన జీవితంలో పవర్ కల్యాణ్ కంటే మించిన మంచి గురువు ఎవరూ లేరంటూ ఆమె పేర్కొంది. తాను 1999 నుంచి చిత్రనిర్మాణంలో పవన్ కల్యాణ్ సహాయంతో మెలుకువలు నేర్చుకుంటున్నానని తెలిపింది. చిత్రనిర్మాణానికి సంబంధించిన అంశంలో పవన్ కల్యాణ్ తనకు ఓ మంచి గురువు అని ఆమె స్పష్టం చేసింది. ఫిల్మ్ మేకింగ్ పరిపూర్ణతను సాధించడానికి సమకరించిన పవన్ కల్యాణ్ కు తానెప్పుడూ రుణపడి వుంటానని రేణు వెల్లడించింది.

రేణుదేశాయ్ తాజాగా ఓ మరాఠి చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు వహించిన సంగతి తెలిసిందే! వాస్తవానికి తాను తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను ఆగస్టు 26వ తేదీన విడుదల చేయాల్సి వుంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ట్రైలర్ ను సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా పడింది. అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆరోజే పవన్ కల్యాణ్ బర్త్ డే కూడా! దీంతో తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ట్రైలర్ పవన్ బర్త్ డేనాడు విడుదల కావడం యాదృచ్ఛికంగా జరిగిందని ఆమె ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.

ఈ విషయం మీదే ఆమె చెబుతూ.. తను ఫిల్మ్ మేకింగ్ విషయంలో మెలుకువలు నేర్పిన పవన్ కల్యాణ్ పుట్టినరోజున తాను దర్శకత్వం వహించిన మూవీ ట్రైలర్ విడుదల కావడం భగవంతుడు ఇచ్చిన గొప్పవరంగా వరంగా భావిస్తానని ఆమె అన్నారు. యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలు మన ఆలోచనలకు దేవుడు ఇచ్చే సమాధానాలు అంటూ స్పష్టం చేస్తోంది. ఇదే విషయాన్ని తాను పవన్ కల్యాణ్ కు చెప్పినప్పుడు అతను నవ్వి ఊరుకున్నాడని ఆమె తెలిపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  renu desai  facebook  movie making  pawan kalyan renu desai  

Other Articles