Balakrishna on following trend

balakrishna, balakrishna movies, latest movies, film news, tollywood news, trends, heros, cinema, nandamuri fans, nandamuri family

balakrishna says he dont fallows trend : i dont like fallowing trend prefers to act in new characters says balakrishna

తలా తోక లేని ట్రెండ్ నాకొద్దు

Posted: 08/31/2014 04:15 PM IST
Balakrishna on following trend

నేను ట్రెండ్ ఫాలో కాను సెట్ చేస్తా.., ఎలాగోలా బతికేద్దామని రాలేదు. ఇవి రెండు తెలుగు సినిమాల్లోని డైలాగులు. కాని బాలకృష్ణ ఇవే డైలాగులను తన సినిమాల కోసం ఉపయోగించుకుంటున్నాుడు. డైలాగులు అంటే అందులోని థియరీ అన్నమాట. తన దగ్గరకు ఎవరైనా వచ్చి ప్రస్తుత ట్రెండ్ ప్రకారం కధ రాశాము.., అందులో తనను కొత్తగా చూపిస్తాం అంటే సినిమా చేయనని చెప్పేస్తానన్నాడు. అలాంటి ట్రెండ్ తనకు అవసరం లేదని స్పష్టం చేస్తున్నాడు.

అదే విధంగా ఎలాగోలా.., తలాతోక లేని ట్రెండ్ ఫాలో కానని బాలయ్య అంటున్నాడు. అభిమానులు, ప్రేక్షకులు తన సినిమా నుంచి ఏం ఆశిస్తారో అవి ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటా. కొత్తదనం ఉండే కధలకు ఎక్కువ ఆసక్తి చూప్తిస్తానని చెప్పాడు. ప్రేక్షకులు కోరుకున్నది ఇవ్వకపోతే వారు అసంతృప్తి చెందుతారు. వారిని మెప్పించలేకపోతే ఎన్ని కష్టాలు పడ్డా వృదా కదా అని అంటున్నాడు.

బాలకృష్ణ సినీ తెరంగేట్రం చేసి నలబై ఏళ్ళు దాటింది. ఆయన నటించిన తొలి సినిమా ‘తాతమ్మ కల’ విడుదలై ఆగస్టు 30కి నలబై వసంతాలు పూర్తి చేసుకుంది. 1974 ఆగస్టు 30న ఈ సినిమా విడుదలైంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  trend  movies  latest news  

Other Articles