Vishal comment on his movies

vishal, hero vishal movies, vishal wiki, latest movies, telugu movies, sruti hasan, dipawali, diwali, pooja, hari, tollywood news, latest news, gosips, risks, feets, stunts

hero vishal comments on his movies says he loves risks : visal sasy audience wants new from every movie that he knows before accepting a movie

ఎన్ని చేసినా దానికోసమే కదా !!

Posted: 08/30/2014 04:49 PM IST
Vishal comment on his movies

డిఫరెంట్ సినిమాలు తీయటంలో తనకంటూ ఓ మార్కును సెట్ చేసుకున్నాడు విశాల్. తన ప్రతి సినిమాలో ఏదో కొత్త అంశం ఉంటుంది. అటు కమర్షియల్, ఇటు డిఫరెంట్ రెండిటిని తన సినిమాలో చూపిస్తాడు. ఇదెలా సాద్యం అని అడిగితే ఆయన తన స్టైల్లో సమాధానం చెప్పాడు. థియేటర్ కు వచ్చే ప్రేక్షకులు సినిమాలో కొత్తగా ఏం చూపిస్తున్నాం అనేది నేను గమనిస్తాను.., ఆ పాయింట్ ఉంటేనే సినిమా చేసేందుకు ఒప్పుకుంటాను అని చెప్తున్నాడు. కొత్తదనం లేకపోతే కచ్చితంగా సినిమా చేయనని స్పష్టం చేస్తున్నాడు.

సినిమా అంటే ఓ రంగుల ప్రపంచం.., ప్రేక్షకుల చప్పట్లే రెమ్యునరేషన్ అని చెప్తున్నాడు. ఎంత కష్టపడ్డా వారి చప్పట్లు.., ఆనందం కోసమే కదా అంటున్నాడు. వారు ఆదరించకపోతే.., ఎంత కష్టపడ్డా వృదా అని చెప్తున్నాడు. అందుకే ప్రేక్షకులను మెప్పించేందుకు ఎంత రిస్క్ చేయటానికైనా వెనకాడనని అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే తనకు రిస్క్ చేయటం అంటే చాలా ఇష్టమని.., ప్రేక్షకుల తాళియాల కోసం ఎలాంటి సాహసమైనా చేస్తానని ధైర్యంగా చెప్తున్నాడు.

శృతిహాసన్ తో కలిసి ‘పూజ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది దీపావళికి విడుదల కానుంది.   అంతేకాకుండా శశికాంత్ దర్శకత్వంలో మరో తెలుగు సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు సుందర్ దర్శకత్వంలో మరో తమిళ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. స్వతహాగా తెలుగువాడైన విశాల్.., ముందు తమిళంలో సక్సెస్ అయి ఆ తర్వాత తెలుగులో ఆదరణ పొందాడు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vishal  pooja  risks  latest news  

Other Articles