More security for shah rukh khan after threat call

Police step up Shah Rukh Khan's security after alleged, Post threat, Shah Rukh Khan gets more security, Shah Rukh gets more security after threat from underworld, Shah Rukh Khan under police protection, Shah Rukh Khan given additional security, Security heightened for Shah Rukh Khan after underworld

Shah Rukh Khan's security beefed up after reports of threat from gangster.... Z-category security now... Cops deny underworld threat to SRK but increase security....

బెదిరింపులు, ఫోన్లు లేవు... ఆశ్చర్యం!

Posted: 08/27/2014 10:53 AM IST
More security for shah rukh khan after threat call

ఇటీవలే బాలీవుడ్ నిర్మాత అలీ మొరానీ ఇంటివద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఐదురౌండ్ల కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తనకు భారీమొత్తంలో డబ్బులు పంపించాల్సిందిగా ఆలీ మొరానీకి రవి పూజారి గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని, అయినా కూడా ఆలీ వాటిని పట్టించుకోకుండా వదిలేసాడని... అందుకే ఆలీని భయపెట్టేందుకు ఆలీ గ్యాంగ్ కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.

అయితే ఆలీ డబ్బుల విషయంలో రాజీపడట్లేదు కాబట్టి... ఆలీకి సన్నిహితుడైన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ను రవి పూజారి గ్యాంగ్ టార్గెట్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. రవిపూజారి సోమవారం మధ్యాహ్నం షారుఖ్ తో మాట్లాడటానికి ప్రయత్నించినట్లు సమాచారం. దాంతో అతను షారుఖ్ పై ఎటాక్ చేసే ప్రమాదం వుందనే ముందు జాగ్రత్తతో షారుక్ కు భద్రతను పెంచారు.

అయితే మోరానీ సోదరులపై జరిగిన కాల్పుల నేపథ్యంలో షారుఖ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయనే రూమర్లు బయటకు వినిపిస్తున్నాయని, నిజానికి చాలారోజుల కిందటే షారుఖ్ నివాసం వద్ద భద్రత ఏర్పాటు చేశామని పోలీసులు చెబుతున్నారు. అదే విధంగా షారుఖ్‌ఖాన్‌కు మాఫియా నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయన్న వార్తల్ని ఆయన ఫ్రెండ్ ఖండించాడు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, రూమర్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో తమకు ఆశ్చర్యంగావుందని బాద్‌షా క్లోజ్ ఫ్రెండ్ అన్నాడు. మరి షారుక్ స్వయంగా స్పందిస్తే తప్ప ఈ వార్తలకు ముగింపు పలికేలాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Shah Rukh Khan security  Gangster Ravi Pujari  police protection  

Other Articles