Harbhajan singh girlfriend geetha basra supports anushka sharma

anushka sharma, geetha basra, geetha basra latest news, anushka sharma virat kohli, virat kohli latest news, anushka sharma geetha basra, harbhajan singh

harbhajan singh girlfriend geetha basra supports anushka sharma : harbhajan singh girlfriend geetha basra supports anushka sharma that she is not main reason for losing england series

అనుష్కకోసం భజన చేస్తున్న హర్భజన్ ప్రేయసి

Posted: 08/25/2014 06:31 PM IST
Harbhajan singh girlfriend geetha basra supports anushka sharma

సాధారణంగా చిత్రపరిశ్రమలో వున్న హీరోయిన్లలో కొంతమంది తిట్టుపోసుకుంటే.. మరికొంతమంది కష్టాల్లో వున్నవారికి ఆదుకోవడంలో ముందుంటారు. మరికొంతమందైతే ఆడిపోసుకుంటుంటారు. ప్రస్తుతం వీరి జాబితాలోకి హర్భజన్ సింగ్ ప్రియురాలు గీతా బస్రా కూడా చేరిపోయింది. అనుష్క శర్మ కోసం ఈ అమ్మడు భజన చేయడం ప్రారంభించేసింది. ఇటీవలే టీమిండియా ఇంగ్లాండ్ సిరీస్ లో ఘోరంగా విఫలం అయిన సంగతి తెలిసిందే! అయితే ఇంత దారుణంగా ఓడిపోవడానికి కెప్టెన్ ధోనీ, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీలే అంటూ వారిమీద విమర్శలు వచ్చాయి. ధోనీ సంగతి అటుంచితే.. కోహ్లీ వ్యవహారం ఒక పెద్ద దుమారాన్నే రేపింది.

కోహ్లీ, అతని ప్రియురాలు అనుష్క శర్మ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడం వల్లే ఈ మ్యాచ్ ఇండియా ఓడిపోయిందంటూ క్రికెట్ అభిమానులతోపాటు బీసీసీఐ కూడా ఘాటుగా కామెంట్లు చేసింది.  త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పడం వల్లే కోహ్లీతోపాటు అనుష్కను ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లేందుకు అనుమతించామని బోర్డు అధికారులు స్పష్టం చేశారు. అయితే అక్కడ వారిద్దరూ తెగ ఎంజాయ్ చేశారని... కోహ్లీ అయితే ప్రాక్టీసుకు రాకుండా తనతోనే ఎక్కువసేపు కాలం గడిపేవాడని బీసీసీఐ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనుష్క వల్లే కోహ్లీ సరిగ్గా ప్రదర్శించలేకపోయాడని.. టీమిండియా ఓడిపోవడానికి ఆమె కూడా ఒక కారణమంటూ వ్యాఖ్యలు చేశారు.

అయితే అనుష్కపై వస్తున్న ఈ వార్తలను హర్భజన్ సింద్ ప్రియురాలు గీతా బస్రా కొట్టిపారేసింది. అనుష్క వల్లే కోహ్లీ సరిగ్గా ప్రదర్శించలేకపోయాడని... మ్యాచ్ లో పూర్తిగా విఫలమయ్యాడని వచ్చిన వ్యాఖ్యలను ఆమె పూర్తిగా ఖండించింది. క్రికెటర్ల వైఫల్యాలకు వారి భార్యలను, ప్రియురాళ్లను నిందించడం సరికాదని ఆమె పేర్కొంది. ఆటగాళ్ల క్రీడా జీవితంలో ఎత్తుపల్లాలు సహజమని, దీనిపై మరొకరిపై నిందలు వేయడం సరైనది కాదు. కోహ్లి వైఫల్యానికి అనుష్కపై నిందలు వేయడం చాలా హాస్యాస్పందంగా వుందంటూ గీతాబస్రా పేర్కొంది. ఇందులో అనుష్క తప్పేమి లేదంటూ ఆమె వెనకేసుకొచ్చింది.

ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఒకవైపు దేశంమొత్తం మీదున్న క్రికెట్ అభిమానులతోపాటు బాలీవుడ్ మొత్త అనుష్క, కోహ్లీల వివాదంపై చర్చించుకుంటుంటే.. వీరిద్దరు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. దీంతో వీరిద్దరూ ఇంగ్లాండ్ టూర్ లో నడిపిన సరసాలు నిజమేననే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వారిమధ్య అటువంటిదేమీ జరగపోయివుంటే.. వారిద్దరూ ఎందుకు పెదవి విప్పడం లేదంటూ ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. లేదంటూ తమమీద వస్తున్న విమర్శలు నిజమేనని ఒప్పుకున్నట్టేనంటూ చెబుతున్నారు. అంటే.. వీరిద్దరూ నేరుగా మీడియా ముందుకొచ్చి వివరిస్తేగానీ ఈ వివాదానికి తెరపడేలా లేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka sharma  geetha basra  virat kohli  harbhajan singh  

Other Articles