Mahesh babu birthday latest movie aagadu second teaser released

mahesh babu latest news, mahesh babu aagadu teaser, mahesh babu aagadu movie, mahesh babu aagadu movie trailers, mahesh babu aagadu teasers, aagadu movie teasers, aagadu movie news, tamanna hot photos, srinu vaitla latest news

Mahesh babu birthday latest movie aagadu second teaser released : tollywood prince mahesh babu latest movie aagadu second teaser released on his birthday special

పులులు, సింహాలను వదిలేసి.. కోడి డిక్కీ మీద టార్గెట్ చేశాడు!

Posted: 08/09/2014 11:01 AM IST
Mahesh babu birthday latest movie aagadu second teaser released

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఏం చేసిన అదొక సెన్సేషన్ గా నిలిచిపోవాల్సిందే! ఇటీవలే ఈయన నటిస్తున్న తాజా చిత్రం ‘‘ఆగడు’’కు సంబంధించి సూపర్ స్టార్ క్రిష్ణ పుట్టినరోజు సందర్భంగా మొదటి టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే! అయితే ఆ టీజర్ అప్పట్లో కొత్త వివాదాలను సృష్టించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘‘గబ్బర్ సింగ్’’ సినిమాను పూర్తిగా కాపీ కొట్టినట్టుగా వుందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయానికి సంబంధించి పవన్ అభిమానులు కూడా గబ్బర్ సింగ్ లో వున్న సన్నివేశాలను ఆగడు టీజర్ తో పోల్చిన ఒక వీడియోను రిలీజ్ చేసి... మహేష్ బాబు కాపీ క్యాట్ అంటూ ప్రచారాలు చేశారు.

అంతేకాదు.. మొదటి టీజర్ లో ప్రిన్స్ చెప్పిన డైలాగులు కూడా పెద్ద దుమారాన్నే రేపాయి. అందులో ముఖ్యంగా ‘‘ప్రతివోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కాంపరిజన్స్.... ఎలకరమొచ్చేస్తుంది’’ అనే డైలాగ్ అప్పట్లో చర్చనీయాంశమైంది. దీంతో పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మహేష్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిమాన నటుడ్ని అవమానించారంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘గబ్బర్ సింగ్’’ లో పవన్ తనను తాను సింహంతోనూ, ‘‘యమదొంగ’’ సినిమాలో ఎన్టీఆర్ పులితోనూ కంపేర్ చేసుకున్న విషయం తెలిసిందే!

ఇదిలావుండగా.. ఈరోజు (09-08-2014) మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘‘ఆగడు’’ రెండో టీజర్ రిలీజ్ అయింది. మొదటి టీజర్ కు పూర్తి భిన్నంగా యాక్షన్ సన్నివేశాలతో కూడిన రెండో టీజర్ ను విడుదల చేశారు.  ఇందులో మొదటి టీజర్ కంటే మహేష్ బాబు డైలాగులు అదరగొట్టే రేంజిలో వున్నాయి. ఇందులో మహేష్ చేసిన అల్లరి అంతాఇంతా కాదు. యెటకారమున్న పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూ.. కామెడీ డైలాగులతో భీభత్సం చేస్తున్నారు. అయితే.. ‘‘డిక్కీ ఎక్కిన కోడి చికెన్ సెంటర్ ముందుకొచ్చి తొడగొట్టినట్లుంది’’ అనే డైలాగ్ ఇక్కడ మరోసారి చర్చనీయాంశంగా మారిపోయింది. పులలు, సింహాలను వదిలేసి.. ఈసారి మహేష్ బాబు కోడి డిక్కీని టార్గెట్ చేశాడంటూ కొంతమంది అభిమానులు సెటైర్లు వేయడం అప్పుడే మొదలుపెట్టేశారు. మొదటి టీజర్ వివాదాలపాలయిన విషయం తెలిసిందే! ఇప్పుడు రెండో టీజర్ కు సంబంధించి సెటైర్లు వేయడం ప్రారంభించేశారు. రానురాను దీనిమీద ఇంకా ఎవరెవరు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి!!

‘‘దూకుడు’’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దాదాపు 40కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా తాజాగా రెండో టీజర్ ను విడుదల చేశారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles