Lucky chance to super star mahesh babu fans

aagadu movie, 14 reels entertainment, mahesh babu latest news, mahesh babu fans, aagadu movie promotions, tamanna latest news, aagadu movie photos, aagadu movie wallpapers, aagadu movie review, aagadu movie telugu review, telugu aagadu movie review

Lucky chance to super star mahesh babu fans : aagadu movie producers giving a lucky chance to mahesh babu fans to participate in movie promotion programmes

ఫ్యాన్స్ తో పనిచేయించుకుంటున్న మహేష్ బాబు!

Posted: 08/08/2014 11:31 AM IST
Lucky chance to super star mahesh babu fans

ప్రిన్స్ మహేష్ బాబుకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏమేరకు వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈయనకు సంబంధించి మూవీల నుంచి పర్సనల్ విషయాలదాకా అన్నింటిలో మహేష్ కు చేయూతనివ్వడానికి వారు ముందుంటారు. ఒక మూవీ రిలీజ్ అయ్యిందంటే చాలు.. దాని ప్రమోషన్ కోసం ఫ్యాన్స్ ఒక నెలముందునుంచే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటారు. ఈయనకున్న క్రేజ్ ను బట్టి సినీనిర్మాతలు కూడా మహేష్ మూవీ ప్రమోషన్ కోసం ఎక్కువ ఖర్చులు కూడా చేయరు. అంతటి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు ఈ రాకుమారుడు. తనపై ఇంతటి అప్యాయతను ప్రదర్శిస్తున్న తన అభిమానుల కోసం మహేష్ బాబు వారికి ఓ లక్కీ ఛాన్స్ అవకాశాన్ని ప్రకటించాడు.

మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం ‘‘ఆగడు’’. ఈ సినిమాకు సంబంధించి ఇదివరకు ఫస్ట్ టీజర్ రిలీజయి రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే! అయితే లేటెస్ట్ గా ఈ మూవీ రెండో టీజర్ ను మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న 14 రీల్స్ ఎంటర్ టైన్మైంట్ వారు ఆరోజు నుంచి మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే మహేష్ అభిమానులకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తూ.. ‘‘ఆగడు’’ ప్రమోషన్ కార్యక్రమాల్లో అభిమానులు కూడా భాగస్వాములను చేయాలని ఆశాభావాన్ని ప్రకటించారు. ఆసక్తిగలవారు ఎవరైనా వుంటే వారు తమ వివరాలను aagadu.14reels.net కు మెయిల్ చేయవచ్చు.

‘‘దూకుడు’’ వంటి భారీ చిత్రాన్ని అందించిన శ్రీనువైట్ల, 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేష్ బాబు సరసన తమన్నా నటించగా... తమన్ సంగతాన్ని అందించాడు. ‘‘దూకుడు’’ కంటే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుండగా... ‘‘ఆగడు’’ సినిమా ప్రమోషన్ లలో భాగస్వామ్యం కలిగిలే అవకాశాన్ని ఇచ్చినందుకు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles