Allu arjun participating in social activities like pawan kalyan

allu arjun latest news, allu arjun patriotism movie, allu arjun sukumar, allu arjun pawan kalyan, allu arjun latest movie, allu arjun pawan kalyan movie news, pawan kalyan patriotism, telugu movies, tollywood movies

allu arjun participating in social activities like pawan kalyan : tollywood stylish star allu arjun doing a short film on Patriotism with director sukumar.

పవన్ ‘‘దేశభక్తి’’ని చాటిచెబుతున్న స్లైలిష్ స్టార్

Posted: 08/07/2014 07:36 PM IST
Allu arjun participating in social activities like pawan kalyan

(Image source from: allu arjun participating in social activities like pawan kalyan)

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏ విధంగా అయితే స్టార్ హీరోగా ఎదిగి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడో... అదేవిధంగా దేశభక్తి, సామాజిక సేవ వంటి కార్యక్రమాల్లో పాల్గొని మంచి మనసున్న మారాజుగా పేరు సంపాదించుకున్నాడు. చిన్నాపెద్దా, కులమతజాతి, పేద-ధనిక వంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ ఆదుకోవడంలో ఎప్పటికీ ముందుటాడు. దీంతో ఈయన ప్రజలమనిషిగా అందరి మనన్నలు పొందాడు. ఈయనతోపాటు మెగా కుటుంబంలో వున్న చిరంజీవి, రామ్ చరణ్ వంటివారు కూడా సామాజిక సేవలో పాల్గొనడానికి ముందుటారు. గతంలో కొన్ని ప్రమాదాల కారణంగా భారీగా ఆస్తినష్టం పొందిన ప్రజలకు ఆర్థిక సహాయం అందించడంలో వీరందరూ ప్రముఖపాత్రను వహించారు.

ఇదిలావుండగా.. ఇప్పుడు తాజాగా స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడానికి ముందుకు వస్తున్నాడు. మన ఉమ్మడి తెలుగురాష్ట్రాల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్న సామాన్య ప్రజలకోసం ఏదైనా ఒక మంచి పని చేయాలనే తపనతో ఒక కార్యరూపం దాల్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. అందులో భాగంగానే అల్లు అర్జున్ తన దేశభక్తిని చాటుతూ ఒక వీడియోను తయారు చేస్తున్నాడు. లెక్కల మాష్టారు అయిన సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ వీడియో.. సాజాజిక చౌతన్యం కోణంలో వుంటుందని ఆయన పేర్కొంటున్నారు.

స్వాతంత్ర్యం దినోత్సవ వేడక సందర్భంగా ఆగస్టు 15వ తేదీన ఈ వీడియోను లాంచ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి వుంది. మరోవైపు అల్లు అర్జున్ దేశభక్తి మీద ఒక వీడియో తెరకెక్కిస్తున్నాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో... మావయ్యా పవన్ కల్యాణ్ నడుస్తున్న బాటలోనే బన్ని కూడా పయనిస్తున్నాడని.. ఆయనలాగే దేశభక్తిని చాటిచెప్పడానికి ముందుకు వస్తున్నాడని ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles