Kangana ranaut and imran khan moving close together in katti batti movie shooting goes viral in bollywood

kangana ranaut latest news, kangana ranaut hot photo shoot, kangana ranaut bikini photos, kangana ranaut latest hot photo shoot, kangana ranaut news, kangana ranaut in relationship with imran khan, kangana ranaut with imran khan, kangana ranaut news

kangana ranaut and imran khan moving close together in katti batti movie shooting goes viral in bollywood

కంగన రనౌతా మజాకా.. ఈసారి పబ్లిక్ లోనే!

Posted: 07/31/2014 01:39 PM IST
Kangana ranaut and imran khan moving close together in katti batti movie shooting goes viral in bollywood

(Image source from: kangana ranaut and imran khan moving close together in katti batti movie shooting goes viral in bollywood)

బాలీవుడ్ లో ఏదైనా వెరైటీగా చేయాలంటే అందుకు ముందుగా కంగనా రనౌత్ వుంటుంది. ఏదైనా సెన్సేషనల్ వార్త వచ్చినా.. అందులో కంగనా రనౌత్ పేరు ఖచ్చితంగా వుంటుంది. ఈమె వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ నుంచి చెప్పులు వాడివదిలేసినట్టుగా బాయ్ ఫ్రెండ్లను మార్చేసేదాకా.. ఈ అమ్మడు ఏం చేసినా అది సంచలనంగా మారిపోతుంది. ఇప్పటికీ ఈ అమ్మడు ఎంతోమంది బాలీవుడ్ హీరోలతో, కో-యాక్టర్ లతో, దర్శకనిర్మాతలతో రహస్యంగా ప్రేమాయణం నడుపుతోందంటూ చాలాసార్లు పుకార్లు వచ్చాయేగానీ... రుజువు మాత్రం కాలేదు.

ఇటువంటి రూమర్లు వచ్చినప్పుడల్లా.. నేను సినిమా షూటింగులతో చాలా బిజీగా వున్నాను. నాకు ఏ బాయ్ ఫ్రెండ్ లేడు. ఒకవేళ నామీద ఎఫైర్స్ కు సంబంధించి గాసిప్స్ వస్తే... అది నాకు మంచిదే! ఎందుకంటే దానివల్ల నా పబ్లిసిటీ బాగా పెరుగుతుంది’’ అని స్టేట్ మెంట్ ఇచ్చి... అందరినీ షాక్ కు గురి చేసింది. అయినాగానీ ఈమె మీద రూమర్లు రావడం మాత్రం తగ్గలేదు కానీ.. కొత్తకొత్త రకాలతో కూడిన సెక్సీ డ్రెస్సులను వేసుకుని పబ్లిక్ లోకి వచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోతుంది.

హీరోలకు సమానంగా బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ హాట్ బ్యూటీ... ‘‘క్వీన్’’ సినిమాలతో బాలీవుడ్ రాణిగా మారిపోయింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ తన జీవితాన్ని బాగానే ఆస్వాదిస్తోంది. అయితే ఇందులోనే బిటౌన్ యంగ్ హీరోతో కలిసి చక్కర్లు కొడుతోందని, చాలా సీక్రెట్ గా రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తోందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. పైగా తాను డేటింగ్ చేస్తున్నది బాలీవుడ్ హీరో, తన అప్ కమింగ్ కోస్టారేనని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం కంగనా రనౌత్ ‘‘కట్టీబట్టీ’’ అనే మూవీలో నటిస్తోంది. అందులో ఈమె కో-స్టార్ ఇమ్రాన్ ఖాన్! వీరిద్దరూ కలిసి నటిస్తున్న నేపథ్యంలో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారని, పైగా పార్టీలకు - పబ్ లకు హద్దుల్లేకుండా తిరుగుతున్నారని సదరు మూవి యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు. వీరిద్దరూ పీకల్లోతుదాకా ప్రేమలో మునిగిపోయారని.. అప్పుడప్పుడు రహస్యంగా తమతమ ఇళ్లకు కూడా వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రతిఒక్క ‘‘కంగనానా మజాకా.. ఇంతవరకు ఏ హీరోతో ఎఫైర్లు పెట్టుకోను అని చెప్పే ఈ హాట్ బ్యూటీ.. ఈసారి పబ్లిక్ లోనే అడ్డంగా బుక్కయ్యిందని’’ చర్చించుకుంటున్నారు.

అయితే ఈ విషయం మీద కంగనా లైట్ తీసుకుంటే.. ఇమ్రాన్ ఖాన్ మాత్రం చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాడని తెలుస్తోంది. మరి ఈ ప్రేమ వ్యవహారం నిజమేనా కాదా..? ఒకవేళ నిజమైతే ఎన్నాళ్లవరకు వుంటుందో..? ఇవన్నీ తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles