Kajal in an erotica with a rape accused hero

Kajal in an erotica with a rape accused hero, Kajal to romance with a rape accused, Kajal Agarwal with Shiney Ahuja in Sudhir Mishra Direction, Kajal Agarwal with Shiney Ahuja, Sudhir Mishra picks Kajal Aggarwal over Chitrangda Singh, Kajal replaced Chitrangada, Kajal Aggarwal over Chitrangda Singh, Kajal Aggarwal Grabs A Big Offer,

Kajal in an erotica with a rape accused hero: Kajal Agarwal has been was chosen for ... Hero Shiney Ahuja, who had been accused of rape case in real life ... As per the latest reports, Kajal Aggarwal has grabbed a big offer from ... Chitrangada Singh was the first choice for Sudhir Mishra but he thought ... Though Chitrangada Singh was the first choice for Sudhir, he later replaced ... Actress Alekhya Latest Pics.

రేపిస్టుతో రొమాన్సుకు సిద్ధమైన కాజల్

Posted: 07/29/2014 03:23 PM IST
Kajal in an erotica with a rape accused hero

సౌత్ లో వచ్చే ఆఫర్లను కాదనుకుని బాలీవుడ్ ఆఫర్ల కోసం ఎగబడుతున్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ అమ్మడికి ప్రస్తుతం సౌత్ లో మంచి ఆఫర్లు వస్తున్నా కూడా నిర్మాతలకు భారీ రెమ్యునరేషన్ కావాలని డిమాండ్ చేస్తుండటంతో... ఈ అమ్మడిని పక్కన పెట్టేసారు. దీంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అయితే తాజాగా ఈ అమ్మడికి బాలీవుడ్ లో ఓ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది.

అయితే ఆ సినిమాలో ముందుగా చిత్రాంగద సింగ్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసేసారు. కానీ మళ్లీ ఏమైందో తెలియదు గానీ... చిత్రాంగద స్థానంలో కాజల్ ను ఎంపిక చేసేసారు. అసలే బాలీవుడ్ ఆఫర్ల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న కాజల్ కు ఈ ఆఫర్ రాగానే వెంటనే ఒప్పేసుకుందట. దీంతో చిత్రాంగదకు సారీ చెప్పేసి... తప్పించేసారట చిత్ర దర్శకనిర్మాతలు. దీంతో కాజల్ పై చిత్రాంగద చాలా కోపంగా ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

ఇదిలా వుంటే.... రొమాంటిక్ డ్రామాతో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు షినీ అహుజాతో కలిసి కాజల్ నటించబోతుండటం ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్స్ అహుజా తో కలిసి నటించడానికి ఇష్టపడటం లేదు. దీనికి కారణం... అహూజా తన దగ్గర పనిచేసే ఒక అమ్మాయిని రేప్ చేసాడని అభియోగాలు రావడమే కాకుండా కోర్టులో ఈ బాలీవుడ్ నటుడికి శిక్ష కుడా పడింది. దీంతో చాలా మంది భామలు అహుజ పేరుచేపితేనే భయపడిపోతున్నారు. అంతేకాకుండా అతని సినిమాలకు కూడా దూరముంటున్నారు. అయితే ఇంత తెలిసి కూడా కాజల్.. ఆహుజాతో కలసి ‘అవుర్ దేవదాస్’ సినిమాలో నటించడానికి సిద్ధమవటం ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles