Big b pleasantly surprises his makeup man

Amitabh Bachchans make-up man's wife gets Range Rover, Amitabh Bachchan Gifted Range Rover To His Make Up, Amitabh Bachchan's Generous Gift to Make-up Man, Mega Star gifts his personal car to make-up man's wife, Big B gifts his car to make-up man's wife, Big-B big gift to his make-up man's wife, Big B pleasantly surprises his makeup man,

Big B Amitabh Bachchan has been involved in many a social activity ... Recently, Amitabh came to know that his make-up man Deepak ... After hearing about it, Amitabh gifted him a Range Rover car to fulfill his wife's dream.

మేకప్ మెన్ కు కారు ఇచ్చేసాడు !

Posted: 07/28/2014 09:57 AM IST
Big b pleasantly surprises his makeup man

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వయసుపైబడుతున్నా కూడా ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. సినిమాల ద్వారానే కాకుండా బుల్లితెర మీద కూడా తన హవా కొనసాగిస్తున్నారు. అయితే ఇంత వయసోచ్చినా కూడా బిగ్ బి ఇంత గ్లామర్ గా ఉన్నారంటే కారణం ఆయన మేకప్ మెన్.

ఎవరి క్రెడిట్ వారికి ఇవ్వాలనేది బిగ్ బి ఆలోచన. అందుకే తనను ఇంత అందంగా రెడీ చేస్తున్న తన మెకప్ మెన్ కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో.. బిగ్ బి తన మెకప్ మెన్ కు ఓ అరుదైన గిఫ్టును అందించాడు. అయితే ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా...? రేంజ్ రోవర్ కారు. బిగ్ బి సాధారణంగా తన కార్లను మూడునాలుగేళ్లకోసారి అమ్మేస్తుంటాడు. 2002లో ఈ రేంజ్ రోవర్ కారును కొన్నాడు.

బిగ్ బి మెకప్ మెన్ దీపక్ సావంత్ భార్య సరోద్ కు ఈ కారును బిగ్ బి గిఫ్టుగా ఇచ్చాడు. ఇది దీపక్ దంపతులు తనకు అందిస్తున్న సేవలకు ఇది ప్రతిఫలమట. అయితే ఇలాంటి గిఫ్టుల విషయంలో దీపక్ కు పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికి... దీపక్ భార్య సరోద్ కు మాత్రం కొత్తకారు కావాలని ఎప్పటినుంచో కోరికగా వున్నట్లుగా తెలుసుకున్న అమితాబ్... తాను తరచూవాడే రేంజ్ రోవర్ ను ఆమెకి కానుకగా అందజేసాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles