Bollywood kahani movie remake in hollywood in the kolkata background

bollywood kahani movie, kahani movie remake in hollywood, vidya balan in kahani movie, vidya balan hot photo shoot, kahani movie photos, kahani movie news, kahani movie hollywood remake, kahani remake in hollywood

bollywood kahani movie remake in hollywood in the kolkata background

హాలీవుడ్ లో గర్భంతో తిరుగుతున్న బాలీవుడ్ తార!

Posted: 07/26/2014 04:10 PM IST
Bollywood kahani movie remake in hollywood in the kolkata background

(Image source from: bollywood kahani movie remake in hollywood in the kolkata background)

సెక్సీనటి విద్యాబాలన్ లీడ్ రోల్ లో నటించిన ‘‘కహానీ’’ చిత్రం బాలీవుడ్ లో ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గర్భంతో వున్న మహిళ అదృశ్యమైన తన భర్తను వెతకుతుండగా.. ఆమె ఎటువంటి పరిణామాలను ఎదుర్కుంది..? చివరికి తన భర్త ఎక్కడున్నాడో తెలుసుకుంటుందా..? అనే నేసథ్యంలో సాగే థ్రిల్లర్ కథ ఇది! ఈ సినిమా బాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించడంతో టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా ‘‘అనామిక’’ పేరుతో తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేశాడు. అయితే దక్షిణాదిలో ఈ సినిమా అంత ప్రభావం చూపలేకపోయింది.

అయితే తాజాగా ఈ సినిమాను చూసిన హాలీవుడ్ దర్శకనిర్మాతలకు మాత్రం ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేసిందని, దీనిని అక్కడ రీమేక్ చేయడానికి సన్నాహాలు సిద్ధం అవుతున్నాయని తాజా వార్తల సమాచారం! సంజయ్ ఘోష్ దర్శకత్వంలో విద్యాబాలన్ ప్రధానపాత్ర పోషించిన ఈ సినిమా హాలీవుడ్ లో రీమేక్ చేయడం ఎంతో విశేషమైన ఘనతే! ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా సిద్ధం అయ్యిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. హాలీవుడ్ లో కూడా కోల్ కతా బ్యాక్ గ్రౌండ్ లోనే తీస్తున్నారు.

బాలీవుడ్ ‘‘కహానీ’’ సినిమాను ఏ పరిసరాల్లో అయితే తెరకెక్కించారో... హాలీవుడ్ రీమేక్ ‘‘కహానీ’’ని కూడా అదే కోల్ కతా నేపథ్యంలో సాగే పరిసరాల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం మొత్తం హాలీవుడ్ బ్యాచ్ మూడునెలలపాటు తట్టాబుట్టా సర్దుకుని కోల్ కతాకు మకాం పెట్టనుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. మహిళలకు సంబంధించి ఒక మంచి మెసేజ్ ను అందిస్తున్న ఈ సినిమాను గ్లోబల్ ఆడియెన్స్ ను చూపించాలనే ఉద్దేశంతోనే రీమేక్ చేస్తున్నట్లుగా యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రకటించింది.

యష్ రాజ్ సంస్థకు సీఎఫ్ఓగా వున్న నటుడు ఉదయ్ చోప్రా ‘‘కహానీ’’ సినిమాను హాలీవుడ్ లో రీమేక్ చేయడంపై ఆనందం వ్యక్తం చేశాడు. హాలీవుడ్ కు అనుగుణంగానే స్ర్కిప్టులో కొన్ని మార్పులు చేర్పులు చేసి, కథను సమకూర్చుకుంటున్నామని ఆయన తెలిపాడు. బాలీవుడ్ లో విశేష విజయాన్ని సాధించిన ఈ కహానీ.. హాలీవుడ్ లో కూడా అంతటి విజయాన్ని సాధిస్తుందా..? అక్కడ జనాలు ఈ సినిమాను ఆదరిస్తారా..? ఈ విషయాలన్నీ తెలియాలంటే కొన్నాళ్లవరకు వెయిట్ చేయాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles