Kollywood producers council warns hero siddharth control his aggressive behaviour

tamil producers, tamil industry producers, tamil producer council, hero siddharth latest news, hero siddharth with samantha, siddharth comments on jigarthanda movie producers, jigarthanda movie news, chikkadu dorakadu movie news

kollywood producers council warns hero siddharth control his aggressive behaviour ||siddharth latest news

చిల్లరగా ప్రవర్తిస్తే ఇలాంటి వార్నింగులే వస్తాయి!

Posted: 07/26/2014 03:01 PM IST
Kollywood producers council warns hero siddharth control his aggressive behaviour

(Image source from: kollywood producers council warns hero siddharth control his aggressive behaviour)

గ్లామర్ డాల్ సమంత ఏవిధంగా అయితే ట్విటర్ ద్వారా తన నోటిదురుసును ప్రదర్శిస్తుందో... ఆమె బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ కూడా అదేవిధంగా సినీదర్శకులు, మీడియా వారిమీద అప్పుడప్పుడు నోరు పారేసుకుంటుంటాడు. ఆమధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీని, దర్శకనిర్మాతలను నోటికొచ్చినట్టు వాగిన సిద్ధార్థ్ ను టాలీవుడ్ ఆంక్షలు విధిస్తూ బ్యాన్ చేసింది. దీంతో ఈ హీరో బాలీవుడ్, కోలీవుడ్ లలో అరకొర సినిమాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు.

ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ తమిళంలో ‘‘జిగర్దండా’’ అనే మూవీలో నటించాడు. తెలుగులో ఇది ‘‘చిక్కడు దొరకడు’’గా వస్తోంది. కానీ కొన్ని ఫైనాన్స్ కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ ను దర్శకనిర్మాతలు వాయిదా వేశారు. అయితే ఈ వాయిదాకు గల కారణాన్ని తెలుసుకోకుండా సిద్ధార్థ్ దర్శకనిర్మాతలపై నోటికొచ్చినట్లు దురుసుగా వాగేశాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న దర్శకనిరర్మాతల మండలి సీరియస్ గా తీసుకుని సిద్ధార్థ్ ను నోరు అదుపులో పెట్టుకోవాల్సిందిగా గట్టి వార్నింగ్ ఇచ్చిందని సమాచారం!

సిద్ధార్థ్ చేసిన ట్వీట్ పై తమిళ దర్శకనిర్మాతల మండలి స్పందిస్తూ... ‘‘నిర్మాతలకు ఎన్నో ఇబ్బందులు వుంటాయని.. అటువంటి సమయాల్లో మరికొన్ని సమస్యలను కొత్తగా సృష్టించి వారిని ఇబ్బందుల్లో పడేయకుండా ప్రమోషన్ నిమిత్తం నిర్మాతకు సహకరించాల్సిందిగా కోరారు. అంతేకానీ నోటికొచ్చినట్లు నిర్మాతలను నిందించడం మంచిది కాదని... ఇంకోసారి ఇలా ప్రవర్తించడాకుండా నోరును అదుపులో వుంచుకుంటే చాలా మంచిదని గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుపుతున్నారు.

అసలు విషయం ఏమిటంటే... రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటించిన ‘‘వీఐపీ’’ సినిమా ఈనెల 18వ తేదీ రిలీజ్ అయింది. అది హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్లపరంగా బాక్సాఫీస్ ని బద్దలు కొడుతోందని తమిళ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో ‘‘జిగార్తండ’’ చిత్ర దర్శకనిర్మాతలు తమ సినిమాను మొదటగా 25వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ.. ధనుష్ సినిమి ఇంకా భారీ వసూళ్లను సాధిస్తుండటంతో మరోవారం తరువాత చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles