(Image source from: Megastar chiranjeevi television talk shows goes viral in tollywood)
టాలీవుడ్ గ్రీకువీరుడు నాగార్జున తన బుల్లితెర షో ‘‘మీలో ఎవరూ కోటీశ్వరుడు’’ ద్వారా యాంకర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ షో కూడా టీవీలో ప్రసారమయ్యే అన్ని షోలకు మించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ షో బాగా పాపులర్ అవడమే కాకుండా, నాగార్జునను కూడా ఓ రేంజికి తీసుకెళ్లిపోయింది. దీంతో టాలీవుడ్ లో వున్న ప్రముఖులందరి కన్ను ఇప్పుడు టీవీ షోల మీద పడిందని టాక్ వినిపిస్తోంది.
ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి కూడా తన 150వ చిత్రం విశేషాన్ని కొన్నాళ్లవరకు పక్కనపెట్టి, బుల్లితెర మీద కనువిందు చేస్తున్నట్టు తాజాగా సమాచారం వెల్లువడుతోంది. ఇందులో భాగంగానే చిరంజీవితో కలిసి ఒక టాక్ షో ను నిర్వహించాలని ఒక ప్రముఖ చానెల్ ప్లాన్ చేస్తోందని ఆమధ్య వార్తలు కూడా వచ్చాయి. కానీ చిరుకు ఆ ప్రతిపాదన నచ్చకపోవడం వల్ల అదే మధ్యలోనే ఆగిపోయిందని చర్చలు కొనసాగాయి.
ఇదిలావుండగా... తాజాగా చిరంజీవి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్వహిస్తున్న ‘‘సౌందర్యలహరి’’ ప్రోగ్రాంలో గెస్ట్ గా వస్తున్నారని.. అందుకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిందని తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ ను ఆగస్ట 3వ తేదీన టెలికాస్ట్ అవుతుందని సదరు ఛానెల్ ప్రకటన కూడా ఇచ్చేసింది. మరోవైపు నాగార్జున టాక్ షో అయిన ‘‘మీలో ఎవరు కోటీశ్వరుడు’’లో కూడా చిరంజీవి అతిథిగా మెరవబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రోగ్రాం కూడా ఆగస్టు 3వ తేదీన ప్రసారం కాబోతోందని టాక్!
దీంతో బుల్లితెర మీద ఈ సమాచారం ఒక పెద్ద దుమారంగా మారిపోయింది. ఒకవైపు రాఘవేంద్రరావుతో, మరోవైపు నాగార్జునతో కలిసి చిరంజీవి రెండు కార్యక్రమాల్లోనూ అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ రెండు షోలు ఒకేరోజు వేర్వేరు ఛానెల్స్ లో ప్రసారం కానున్నాయి. దీంతో ఏ ఛానెల్ టీఆర్ పీ రేటింగ్స్ ఎక్కువవస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more