Junior ntr facing problems with pawan kalyan in sankranthi festival

Junior Ntr facing problems with pawan kalyan, junior ntr latest news, junior ntr with pawan kalyan, pawan kalyan latest news, pawan kalyan with junior ntr, pawan kalyan new movie gopala gopala, gopala gopala movie news, junior ntr next movie with puri jagannath, pawan kalyan and junior ntr movies to release in sankranthi festival, junior ntr new movie, pawan kalyan krishna avatar in gopala gopala movie

junior ntr amd pawan kalyan movies in sankranthi festival

నందమూరి హీరోను భయపెట్టిస్తున్న పవన్ కల్యాణ్!

Posted: 07/21/2014 03:20 PM IST
Junior ntr facing problems with pawan kalyan in sankranthi festival

హమ్మయ్యా! పవన్ ఇక రాజకీయాల్లోకి వెళ్లాడు. ఇక మనం టాలీవుడ్ తెరను చించేద్దాం, దున్నేద్దామని చంకలు కొట్టుకున్న హీరోలకు... మళ్లీ మేకులా తయారయ్యాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్! సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘‘ప్రజల సంక్షేమం కోసం నేనున్నానంటూ’’ జనసేన పార్టీని స్థాపించి, ప్రచారాలు చేసుకుంటూ కాలం గడిపిన పవన్ కల్యాణ్... తిరిగి సినిమాల్లో నటిస్తానని ప్రకటించడంతో టాలీవుడ్ హీరోలందరరూ భయపడుతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇమేజ్ ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈయన సినిమా రిలీజవుతోందని తెలిస్తే చాలు... వారంరోజుల ముందే అభిమానులు టిక్కెట్ల కోసం క్యూలో నిలబడిపోతారు. ఈయన సినిమా ముందు ఏ సినిమా వచ్చినా అది తుడుచుకుపోవాల్సిందేనని అందరి అభిప్రాయం. ఎందుకంటే... పవన్ నటించిన ‘‘అత్తారింటికి దారేది’’ సినిమా రిలీజ్ కి ముందే పైరసీకి గురైనప్పటికీ... సినిమా మాత్రం కలెక్షన్లతో రికార్డుల సునామీయే సృష్టించింది. దీంతో ఇతర హీరోలు కూడా తమ సినిమాలను పవన్ కు పోటీగా విడుదల చేయకుండా రిలీజ్ డేట్ అటూఇటూగా ఒక వారం రోజుల తేడాతో రిలీజ్ చేస్తారు.

ఇప్పుడు ఇటువంటి సమస్యే జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చి పడింది. పూరీ జగన్నాథ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో త్వరలోనే సెట్స్ పైకి వెళ్తున్న విషయం తెలిసిందే! దర్శకుడు పూరీ కూడా ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ముగించేసి సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నట్టు యూనిట్ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. పైగా ఆ సమయంలో మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు సంబంధించిన భారీ చిత్రాలు కూడా ఏమి లేకపోవడం వల్ల తమ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తాయని నిర్మాతలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.

అయితే తాజాగా పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘‘గోపాల గోపాల’’ చిత్రం కూడా కొన్ని మార్పుల కారణంగా సంక్రాంతికే రిలీజవుతుందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఎన్టీఆర్, పవన్ సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగితే... ఎన్టీఆర్ సినిమాకు దెబ్బపడే అవకాశాలు వుంటాయి. పవన్ సినిమా బాగున్నా.. బాగలేకపోయినా.. తనకున్న ఇమేజ్ తోనే కలెక్షన్లను దున్నుకుపోతాడు. దీంతో ఎన్టీఆర్ కు మరోసారి పవన్ రూపంలో కష్టాలు ఎదురుకానున్నాయి. పైగా బాలకృష్ణ మూవీ ‘‘గాడ్సే’’ వచ్చే సంక్రాంతికే రిలీజ్ అవుతున్నట్టు యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ విషయాన్ని పక్కనపెడితే.. జూనియర్ పరిస్థితి ఏమవుతుందోనని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles