Rajamouli controversial comments on ram gopal varma

Rajamouli Ironically comments on controversial director ram gopal varma, director rajamouli comments on ram gopal varma, ram gopal varma latest news, rajamouli with ram gopal varma, ram gopal varma comments on rajamouli, rajamouli with ramgopal varma, ramgopal varma ice cream movie, rajamouli controversial comments on rajamouli, rajamouli latest news, ram gopal varma latest news

Director Rajamouli Ironically comments on controversial director ram gopal varma

వర్మపై సెటైర్లు వేసిన జక్కన్న!

Posted: 07/21/2014 12:56 PM IST
Rajamouli controversial comments on ram gopal varma

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సంచలనాల దర్శకుడిగా పేరొందిన రామ్ గోపాల్ వర్మపై సెటైర్స్ వేశాడు. సాధారణంగా రాజమౌళి సినిమాలకు సంబంధించి ఏ వివాదాలు వచ్చినా వాటికి దూరంగానే వుంటాడు. ఇతనిపై సెటైర్స్ వేసినా వాటిని పట్టించుకోకుండా కామెడీగా తీసిపారేస్తాడు. అటువంటి దర్శకుడు ఇప్పుడు వర్మపై కామెంట్లు చేయడం పెద్ద దుమారంగా మారిపోయింది. జక్కన్న వర్మపై సెటైర్లు వేశాడా అంటూ ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

టాలీవుడ్ వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఫిల్మ్ మేకింగ్ మీద ఉపన్యాసం ఇస్తూ ఒక వీడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో కొత్త వివాదాలకు దారితీసింది. డైరెక్టర్ రాజమౌళి కూడా ఆ వీడియోను కనువిందు చేసి... దానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి ట్విటర్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను కొంచెం పొగుడుతూనే వ్యంగ్యంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు జక్కన్న!

అందులో భాగంగా.. ‘‘రాంగోపాల్ వర్మ విడుదల చేసిన ఉపన్యాస వీడియోను నేను నిన్నరాత్రి నుంచి 3 సార్లు చూశారు. ప్రస్తుతమున్న మన సినిమా పరిశ్రమకు సవాలుగా వుంటూనే... సంప్రదాయ పద్దతులను పునాదిగా వుంటుంది. దర్శకనిర్మాతలందరూ ఈ వీడియోను జాగ్రత్తగా చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సినిమాను తెరకెక్కించడానికి డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు. అందుకు ఒక కథ, దృఢ సంకల్పం తప్పనిసరి. అందుకు మీరు ‘‘ఐస్ క్రీమ్’’ సినిమాను ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అందులో వున్న పనితనాన్ని ఒక మోడల్ గా భావించండి’’ అంటూ వర్మ ‘‘ఐస్ క్రీమ్’’ సినిమాపై, ఆయన పనితీరుపై వ్యంగ్యంగా కామెంట్లు చేశాడు.

దీంతో మొదట అభిమానులు దీనిని చూసి షాక్ తిన్న.. ఆ తరువాత జోక్ అనుకుని లైట్ తీసుకున్నారట! ఏదేమైనా... జక్కన్న వర్మపై జోకులేసుకుంటే వ్యంగ్యంగా కామెంట్లు చేయడం ఇదే మొదటిసారి అంటూ సినీవిశ్లేషకులు చెప్పుకుంటున్నారు. అయితే వర్మ ఈ విషయం మీద ఎలా స్పందిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles