Romantic song between tamanna and prabhas in bahubali movie

Romantic song between tamanna and prabhas in bahubali movie, bahubali movie latest news, bahubali movie news, bahubali movie schedules, tamannah in bahubali movie, prabhas in bahubali movie, prabhas and tamannah romantic song in bahubali movie, romantic song between tamanna and prabhas in bahubali movie, romantic song with trussers ropes in bahubali movie

Romantic song between tamanna and prabhas in bahubali movie, bahubali movie latest news

తమన్నాకు ప్రభాస్ తో తాడు కట్టించిన జక్కన్న!

Posted: 07/18/2014 03:41 PM IST
Romantic song between tamanna and prabhas in bahubali movie

(Image source from: Romantic song between tamanna and prabhas in bahubali movie)

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘‘బాహుబలి’’ సినిమాకు సంబంధించి రోజుకో వార్త వెలువడుతూనే వుంది. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో జక్కన్న ఎన్నోరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. భారీఫైట్ల సన్నివేశాల కోసం హీరో ప్రభాస్, రానాలతోపాటు సహనటులతో కూడా ఎక్సర్ సైజులు చేయిస్తున్నాడు. రానా - ప్రభాస్ ల మధ్య జరిగే యుద్ధ సన్నివేశాల కోసం కొన్ని ప్రత్యేక కెమెరాలను వినియోగిస్తున్నాడు.

ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో హీరో ప్రభాస్, తమన్నాల మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేయనున్నాడని సమాచారం. అయితే ఇందులో విశిష్టమైన విషయం ఏమిటంటే.. రాజమౌళి ఈ పాటకోసం ప్రత్యేకంగా ట్రస్సర్ అనే యంత్రాల సహాయంతో తెరకెక్కిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ఈ ట్రస్సర్స్ ను భారీ ఫైట్ల చిత్రీకరణలో ఉపయోగిస్తారు. కానీ ఒక రొమాంటిక్ పాటకోసం ఇంతటి భారీ యంత్రాన్ని రాజమౌళి ఎలా ఉపయోగించనున్నాడా అని యూనిట్ సభ్యులందరూ ఆశ్చర్యపోతున్నట్టు చెబుతున్నారు.

ఒక భారీ యంత్రం చుట్టూ పెద్దపెద్ద రోప్స్ కట్టి, వాటిమధ్య ప్రభాస్, తమన్నాల మధ్య రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించనున్నారు. దీంతో రాజమౌళి చేయబోయే ప్రయోగాల్లో ఈ సాంగ్ కూడా అద్భుతంగా వుంటుందని యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు. వందకోట్లకుపైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2015 వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles