Actress hansika kannada version attarintiki daredi movie

Actress hansika clarifies rumours on kannada version attarintiki daredi movie, hansika latest news, hansika motwani hot photos, hansika latest news, hansika hot photo shoot, hansika hot photos, hansika clarifies on attarintiki daredi movie, hansika with hero sudeep, hansika fire on media, hansika hot stills, hansika hot photos, hansika news, hansika motwani news, hansika motwani hot photos, hansika comments on attarintiki daredi movie

hansika motwani in kannada version attarintiki daredi movie

‘‘అత్తారిల్లు’’లో హన్సిక కనిపించడం లేదట!

Posted: 07/17/2014 12:33 PM IST
Actress hansika kannada version attarintiki daredi movie

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘‘అత్తారింటికి దారేది’’ సినిమా టాలీవుడ్ లో సరికొత్త రికార్డులను సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే! తెలుగుచిత్ర పరిశ్రమలోనే దాదాపు 85 కోట్ల కలెక్షన్లను రాబట్టిన మొట్టమొదటి సినిమా ఇది! సుమారు 55 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం.. పవన్ కల్యాణ్ కెరీర్ లో ఒక పెద్ద హిట్ గా నిలిచిపోయింది. గతంలో టాలీవుడ్ లో వున్న అందరి హీరోల రికార్డులను ఈ సినిమా తుడిచిపారేసింది. కేవలం టాలీవుడ్ లోనే కాదు... ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది.

ప్రస్తుతం ఈ సినిమాను కన్నడలో స్టార్ హీరోగా పేరు పొందిన సుదీప్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. కన్నడలో కూడా ఈ సినిమాను అదిరిపోయే రేంజిలో తీసేందుకు యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో పాలబుగ్గల చిన్నది అయిన హన్సిక... ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాదాపు ఈమె ఫైనల్ అవుతుందని సమాచారాలు కూడా వెలువడ్డాయి. దీంతో అందరూ ఈ అమ్మడిని ‘‘మీ అత్తారిల్లుని ఎప్పుడు చూపిస్తావు’’ అంటూ అడుగుతూ సెటైర్లు వేయడం ప్రారంభించారని అనుకుంటున్నారు.

అయితే తాజాగా హన్సిక కన్నడలో తెరకెక్కిస్తున్న ‘‘అత్తారింటికి దారేది’’ సినిమాలో నటించడం లేదంటూ తన సోషల్ నెట్ వర్క్ మీడియా ద్వారా వెల్లడిస్తోంది. ఇంతవరకు నాకు ఆ సినిమా నుంచి ఎటువంటి సమాచారం అందలేదని... ఎటువంటి క్లారిఫికేషన్ లేకుండా వార్తల్ని క్రియేట్ చెయ్యొద్దని గుర్రుగా సమాధానమిచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఏదైతేనేం... మొన్నటివరకు హన్సికయే హీరోయిన్ అనే పుకార్లకి ఇక ఫుల్ స్టాప్ పడిపోయింది. మరి ఇందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

హీరో సుదీప్ తన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గతంలో కూడా తాను తన సినిమాలను నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఇందులో సుదీప్ కు అత్తగా తమిళ హీరోయిన్ మధుబాల నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని విశేషాలను త్వరలోనే విడుదల చేస్తామని యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles