Junior ntr singing rakasi song in rabhasa

junior ntr singing rakasi song in rabhasa movie, junior ntr latest news, junior ntr in rabhasa movie, junior ntr with samantha, junior ntr with ss thaman, junior ntr song in rabhasa movie, junior ntr rakasi rakasi song in rabhasa movie, rabhasa movie stills, samantha latest news, samantha hot photos, samantha hot photos, junior fires on samantha, samantha fires on junior ntr

junior ntr singing rakasi rakasi song in rabhasa movie for samantha

సమంతను ‘‘రాకాసి’’ అంటూ తిడుతున్న హీరో

Posted: 07/16/2014 04:12 PM IST
Junior ntr singing rakasi song in rabhasa

తన స్టెప్పులతో టాలీవుడ్ కుర్రకారులను మత్తెక్కించే జూనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు సమంతను రాకాసి అంటూ తిట్టిపారేస్తున్నాడు. ‘‘రాకాసి.. రాకాసి..’’ అంటూ రాగాలు తీస్తూ సమంతను టీజ్ చేయడం మొదలు పెట్టేశాడు మన యంగ్ టైగర్. అయితే ఎన్టీఆర్ నేరుగా సమంతను తిట్టడం లేదు కానీ... ‘‘రభస’’ చిత్రంలో భాగంగానే ఆమెను టీజ్ చేస్తూ అల్లరి చేస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్, సమంత జంటగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘‘రభస’’. ఇందులో ఎన్టీఆర్ చాలారోజుల తరువాత తిరిగి ఒక పాట పాడబోతున్నాడు. మ్యూజిక్ తమన్ తనని ఎలాగైన పాడాల్సిందేనని బలవంతం చేయడం వల్లే తాను ఇందులో పాట పడుతున్నట్టుగా పేర్కొన్నాడు యంగ్ టైగర్. ఇందులో భాగంగానే ‘‘రాకాసి రాకాసి’’ అంటూ సాగే ఒక టీజింగ్ పాట వుందని సమాచారం! ఈ పాటకు కేవలం ఎన్టీఆర్ పాడితేనే బాగుంటుందని, మిగతావారు ఎంత బాగా పాడినా.. అది వారికి సూట్ అవదని తమన్ పట్టబడటం వల్ల ఎన్టీఆర్ అందుకు ఒప్పుకున్నాడట! ఈ విషయాన్ని స్వయంగా తమన్ తన ట్విటర్ ద్వారా అందరికీ తెలియపరిచాడు.

జూనియర్ ఎన్టీఆర్ కు పాటలు పాడటం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఈయన కంత్రి, యమదొంగ, అదుర్స్ వంటి తదితర సినిమాల్లో పాటలకు తన గళం కలిపి ప్రేక్షక జనాలను అలరించాడు. ఇప్పుడు మళ్లీ చాలారోజుల తరువాత తన గొంతును సవరించుకుంటున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రణీత రెండవ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ.. ఆగస్టు 14వ తేదీన రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles