Interview suresh babu

Interview Suresh Babu, Suresh Babu Talks About TFI Shift, Shift of Telugu Film, Suresh Babu latest Interview, Suresh Babu, gopala gopala, drushyam movie, daggubati suresh babu

Suresh Babu Talks About TFI Shift

అన్యాయంగా దోచుకోలే... మా పెద్దల ఆస్థితో మాత్రమే

Posted: 07/09/2014 11:14 AM IST
Interview suresh babu

టాలీవుడ్ సినీ పరిశ్రమ విడిపోవాలని చాలా మంది కొద్దిరోజుల నుంచి మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా టాలీవుడ్ సినిమా పరిశ్రమ మొత్తం కేవలం నాలుగు కుటుంబాల ఆధీనంలో మాత్రమే ఉన్నాయంటూ కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ఈ వార్తలపై నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు గతకొద్ది రోజులుగా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే తాజాగా ఈ వార్తలన్నింటి గురించి నిర్మాత సురేష్ బాబు తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

‘చిత్ర పరిశ్రమ హైదరాబాద్ ను వీడుతుందా అని అందరూ అడుగుతున్నారు. ఎక్కడ రాయితీలు, సబ్సిడీలు ఇస్తే అక్కడకు పరిశ్రమ వెళ్లి తీరుతుంది. అది విశాఖపట్నమా లేక విజయవాడా అనేది మరో ఐదేళ్లలో తేలిపోతుంది. ఛాంబర్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. చెన్నై నుంచి వచ్చి చిత్రీకరణలు ప్రారంభించినప్పుడు ఇక్కడ ఛాంబర్ లేదు. ఛాంబర్ అనేది కేవలం ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్య వారధి మాత్రమే. ప్రధాన కేంద్రంలో ఛాంబర్ ఉంచి.. మనకు అనువైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరపొచ్చు. అది ఆదిలాబాద్ కావొచ్చు.... రాజమండ్రి కావచ్చు’ అని తెలిపారు.

అంతే కాకుండా...  ‘టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఏం జరిగినా కూడా ‘ఆ నాలుగు కుటుంబాలు’ అని అంటుంటారు. మేమేమి పరిశ్రమలో అన్యాయంగా డబ్బులు సంపాదించుకోలేదు. ఎక్కడో డబ్బులు తీసుకోని స్టూడియోలు కట్టుకోలేదు. మా పెద్దలు సినిమాలు తీసి సంపాదించిన డబ్బుతో స్టూడియోలు, పంపిణీ సంస్థలు ఏర్పాటు చేసుకున్నాం. థియేటర్ల సమస్య దేశవ్యాప్తంగా ఉంది. పెద్ద కంపెనీలు థియేటర్లను లీజుకు తీసుకొంటున్నాయి. ఆయా థియేటర్ల యాజమాన్యాలు కూడా అందుకు అంగీకరిస్తున్నాయి. దీంతో ఆ యాజమాన్యానికి నచ్చిన డబ్బులొస్తాయనుకునే సినిమానే ఆడిస్తారు’ అని చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles