Ntr puri movie title istemper

ntr-puri movie title istemper, ntr rubabu title chance to temper, puri jaganadh new film temper, ntr movie title temper, ntr now show his temper

ntr-puri movie title istemper

ఎన్టీఆర్ ‘టెంపర్ ’ ఏంటో చూపిస్తాడట

Posted: 07/07/2014 11:53 AM IST
Ntr puri movie title istemper

జిహ్వకో రుచి... పూటకో బుద్ది అన్నట్లుగా ఉంది పూరీ జగన్నాథ్ వ్యవహారం. ఈయన త్వరలో ఎన్టీఆర్ తో ఓ సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్టీఆర్ కి ‘ఆంద్రావాలా ’ లాంటి అట్టర్ ప్లాప్ సినిమా ఇచ్చాక దశాబ్దం తరువాత అవకాశాన్ని చేజిక్కున్న ఈయన స్టోరీ పరంగా, డైలాగుల పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అలాగే టైటిల్ విషయం లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లే అనిపిస్తుంది. సినిమా స్టోరీకి తగ్గట్లు టైటిల్ ఉండాలని బావించి అనేక పేర్లను పరిశీలనలోకి తీసుకుంటున్నాడు. అందుకే పూటకో టైటిల్ మారుస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా కోసం ‘కుమ్మేస్తా ’, ‘రుబాబు ’ వంటి టైటిల్స్ వినిపించాయి. తాజాగా వాటిని పక్కన పెట్టిన ‘టెంపర్ ’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు, హీరో పాత్రకు ఈ టైటిల్ కి సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నాడట.

పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు కాబట్టి ‘రుబాబు ’ టైటిల్ సూట్ కాదని టైటిల్ ని మార్చేసినట్లు చెప్పుకున్నాడు. మొదటి నుండి ఎక్కువ మాస్ టైటిళ్ళనే పెట్టి హిట్లు కొట్టిన ఈయన ఇప్పుడు అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రానికి ఈనెల 30 తేదీన మొదలు పెట్టబోతున్నారు. కాజల్ కథానాయికగా నటిస్తుంది. సాధ్యమైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 9వ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles