Baahubali creates new records pre release business

baahubali creates new records , baahubali pre-release business rajamouli baahubali movie, baahubali part 1release in april 2015, shobu yarlagadda, prasad devineni , prabhas,anushka,sweety,tamannaha,rana daggubati,baahubali release date

Baahubali creates new records pre-release business

బాహుబలి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్

Posted: 07/04/2014 10:30 AM IST
Baahubali creates new records pre release business

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అంత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ప్రాజెక్ట్ ‘బాహుబలి ’. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుండే దీనికి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. కారణం టాలీవుడ్ లో ఓటమంటూ ఎరుగని సినిమాలు తీయడం, ‘ఈగ ’ వంటి అంతర్జాతీయ సినిమాను రూపొందించిన తరువాత ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో దీని పై నిర్మాతలకు, బయ్యర్లకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరో సంవత్సరం తరువాత మొదటి భాగం విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పటి నుండే భారీ బిజినెస్ జరుగుతుంది. ఈ సినిమా కోసం వివిధ రాష్ట్రాల బయ్యర్లు పోటీ పడి మరీ హక్కుల్ని సొంతం చేసుకుంటున్నారు. తాజాగా,కర్ణాటక, సీడెడ్ హక్కుల్ని బయ్యర్లు భారీ రేటు పెట్టి సొంతం చేసుకున్నారని అంటున్నారు. మనకందిన సమాచారం ప్రకారం కర్ణాటక హక్కులు 9 కోట్లకు అమ్ముడుపోతే, సీడెడ్ (రాయలసీమ) 13 కోట్లకు అమ్ముడుపోయాయని అంటున్నారు.

ఇప్పటి వరకు టాలీవుడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంత స్థాయిలో చేసిన తొలి చిత్రం ఇదే అని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. కర్ణాటక, సీడెడ్ హక్కులే ఇంత భారీ రేటుకు అమ్మడు పోతే ఎంతో బిజినెస్ జరిగే నైజాం, ఆంధ్ర ప్రాంతాల్లో బిజినెస్ ఇంకేస్థాయిలో ఉంటుందో అని వ్యాపార వర్గాలు ఆసక్తితో గమనిస్తున్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కే ఈ సినిమాను నాలుగు భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన తారాగణంగా రూపొందుతున్న ఈ సినిమాను 170 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles