Deepika padukoke world no 1 sexiest woman

deepika padukoke world no.1 sexiest woman, fhm magazine poll, katrina kaif, world no.1 sexiest woman, priyanka chopra, nargis fhakri , shruti haasan, ileana and neha sharma, yami gautham, trisha

Deepika Padukoke World No.1 Sexiest Woman

మగువలు మెచ్చిన శృంగార తార దీపికా

Posted: 07/03/2014 04:08 PM IST
Deepika padukoke world no 1 sexiest woman

ప్రముఖ అంతర్జాతీయ పురుషుల మేగజైన్ ఎఫ్.హెచ్.ఎం. పత్రిక నిర్వహించిన ప్రపంచంలో కెల్లా టాప్ 100 శృంగార తారలు ఎవరనే దాని పై నిర్వహించిన పోల్స్ లో దీపికాకు మొదటి స్థానం లభించింది. వందమంది సెక్సీయెస్ట్ ఉమెన్ పోల్స్ లో దీపికాకే అత్యధికంగా ఓట్లు వేశారు. గత సంవత్సరం ఇదే పోల్స్ లో మూడో స్థానంలో ఉన్న దీపికా పదుకునే ఈసారి మొదటి స్థానంలోకి దూసుకొచ్చింది.

దీపికా సాధించిన అరుదైన ఘనతకు గాను త్వరలో విడుదల చేయనున్న ఎఫ్ హెచ్ఎం మ్యాగజైన్ పై దీపికా దర్శనమివ్వనుంది. త్వరలో వెలువడనున్న మ్యాగజైన్ లో 100 శృంగార మహిళ (సెక్సీయస్ట్ ఉమెన్)ల జాబితాను కూడా విడుదల చేయనున్నారు. గతంలో రెండుసార్లు సెక్సీయెస్ట్ ఉమెన్ గా టైటిల్ ని సొంతం చేసుకున్న కత్రినా ఈసారి మూడో స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ప్రియాంక చోప్రా చోటు సంపాదించుకోగా, నర్గీస్ ఫక్రీని నాలుగో స్థానంలో నిలిపారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతున్న శృతిహాసన్ కి ఐదో స్టానాన్ని కట్టబెట్టారు.

Deepika-Padukone

ఇలియానా, నేహా శర్మ టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. నేహాశర్మకు ఏడో స్థానంలో, ఇలియానా ఎనమిదో స్థానంలో నిలిచారు. యామీ గౌతమ్ 24వ స్థానంలో, మిల్కీ బ్యూటీ తమన్నా 40వ స్థానం దక్కించుకుంది. ఇండస్ట్రీలో ముదురు హీరోయిన్ అయిన త్రిషకు టాప్ 100లో స్థానం దక్కడం విశేషం. తనకు శృంగారతార కిరీటం దక్కడం పై దీపికా స్పందిస్తూ... సినిమా, మోడలింగ్ ద్వారా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులే తనకు ఈ టైటిల్ దక్కేలా చేసిందని.. తన శరీర సౌష్టవానికి టైటిల్ కు సంబంధం లేదని దీపికా అన్నారు. మోడలింగ్ రంగంలో తాను ప్రమోట్ చేసే ఉత్పత్తుల కారణంగా కూడా సినీ జీవితానికి గుర్తింపు దక్కిందన్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles