Cat fight between kareena kapoor and vidya balan

Cat fight between kareena kapoor and vidya balan,

Cat fight between kareena kapoor and vidya balan

నేను కమర్షియల్.. నేను డర్టీ!

Posted: 06/30/2014 04:13 PM IST
Cat fight between kareena kapoor and vidya balan

(Image source from: Cat fight between kareena kapoor and vidya balan)

బాలీవుడ్ లో అగ్ర కథానాయికలుగా వెలుగుతున్న విద్యాబాలన్, కరీనా కపూర్ ల మధ్య మాటలయుద్ధం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా వీరిద్దరు ఇచ్చిన తమతమ ఇంటర్వ్యూల్లో ఒకరు కమర్షియల్ మూవీస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పుకుంటే.. మరొకరు దానికి విరుద్ధంగా ఇంకొకరు సినిమాల్లో డర్టీగా కనిపించడం కంపల్సరీ అని చెబుతున్నారు.

మొన్నటికి మొన్న కరీనా కపూర్.. ‘‘నేను విద్యాబాలన్ నటించిన డర్టీ పిక్చర్ లాంటి సినిమాల్లో నేను నటించను. అసలు అటువంటి సినిమాల జోలికే నేను వెళ్లను’’ అని ఖరాఖండీగా విద్యాబాలన్ ని తిట్టితిట్టనట్టుగా ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది. అలాగే... ‘‘కమర్షియల్ చిత్రాల్లో నటించాలంటే నాకెంతో ఇష్టం. నేను గతంలో నటించిన గోల్ మాల్ రిటర్న్స్, బాడీగార్డ్, రా.వన్ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్లు రాబట్టాయి. ఆ సినిమాల్లో నేనెంతో సరదాగా కూడా గడిపాను. అందుకే నన్ను నేను కమర్షియల్ హీరోయిన్ గా చెప్పుకుంటున్నాను’’ అని చెప్పింది.

ఇంతటితో ఆపకుండా విద్యాబాలన్ కు ఇన్ డైరెక్ట్ గా తిట్టేలా... ‘‘నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 21 సంవత్సరాలు అవుతోంది. నా ఎక్స్ పీరియెన్స్ లో ఛమేలీ, తలాష్ వంటి వేశ్య పాత్రల్లో నటించాను. నన్ను నేను నిరూపించుకోవడానికే అటువంటి పాత్రలను చేశానే తప్ప... నాకు అటువంటి పాత్రలు చేయడం అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇక నుంచి ‘‘డర్టీ పిక్చర్’’ లాంటి సినిమాల్లో నేను నటించను. వాటి గురించి ప్రస్తవించను కూడా!’’ అని చెప్పేసింది.

అయితే కరీనా కపూర్ చెప్పిన మాటలు విద్యాబాలన్ చెవి వరకు చేరాయో లేదో తెలియదు కానీ... తన తాజా సినిమా అయిన ‘‘బాబీ జాసూస్’’ ప్రమోషన్ కోసం హైదరాబాద్ కు వచ్చిన ఈ డర్టీ భామ... కరీనా చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా మాట్లాడింది. ‘‘నేను నా కెరీర్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, నా నటనను నిరూపించుకోవడానికి ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా వున్నాను’’ అని స్పష్టం చేసింది. అలాగే తన డర్టీ పిక్చర్ అనుభవం గురించి వివరిస్తూ... ‘‘డర్టీ అనేది ఒక ఎంటర్ టైన్ మెంట్... నేనే ఆ ఎంటర్ టైన్ మెంట్’’ అని చెప్పింది. అంటే.. తాను డర్టీ పిక్చర్ లాంటి పాత్రల్లో నటించడానికి ఎల్లప్పుడూ సిద్ధమేనని మనసులో వున్న మాటను చెప్పేసినట్టేనన్నమాట!

ఇలా ఇద్దరు కథానాయికలు తమ పాత్రల మీద చేసుకుంటున్న కామెంట్లను చూసి... ‘‘వీరిద్దరి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోందని’’ సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఏదీఏమైనా... అగ్రకథానాయికలు అన్నాక క్యాట్ ఫైట్లు, మాటలయుద్ధాలు మామూలేనని ఈ విషయాన్ని అందరూ లైట్ గా తీసుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles