టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇమేజ్ ఎటువంటిదో ప్రతిఒక్కరికీ తెలిసిందే! ‘‘అత్తారింటికి దారేది’’ సినిమాలో స్టోరీలైన్ పాతదే అయినప్పటికీ.. ఈయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే అది టాలీవుడ్ లో రికార్డులను బద్దలుకొట్టి, భారీ కలెక్షన్లను రాబట్టిందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో ఈయన ఇమేజ్ ను క్యాచ్ చేసుకునేందుకు కొందరు హీరోయిన్లు ఈయన వెంటబడుతున్నట్టు తాజా సమాచారం!
గతంలో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన కాజల్ అగర్వాల్... గబ్బర్ సింగ్ - 2 సినిమాలో పవన్ సరసన నటించే అవకాశం వచ్చినా... భారీ రెమ్యునరేషన్ కావాలని డిమాండ్ చేసి, ఆ ఆఫర్ ని వదులుకుని, చేతులు కాల్చుకుంది. అలాగే చాలావరకు సినిమాలను వదులుకుంది. దీంతో ఈ అమ్మడికి అటు టాలీవుడ్, కోలీవుడ్ లోనూ సినిమా అవకాశాలు అమాంతంగా తగ్గిపొయ్యాయి.
ప్రస్తుతానికి రామ్ చరణ్ సరసన గోవిందుడు అందరివాడేలే సినిమాలో నటిస్తున్నప్పటికీ.. మునుపటి స్టార్ డమ్ తిరిగి రప్పించుకోవడం కోసం ఇప్పుడు పవన్ వెంటపడుతున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ అమ్మడు పవన్ కల్యాణ్ సరసన నటించేందుకు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఇఫ్పుడు మరో భామ కూడా కాజల్ బాటలోనే నడుస్తున్నట్టు కనిపిస్తోంది. తన మొదటి సినిమా అయిన ‘‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’’తో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్... ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ డమ్ ని పొందడానికి పవన్ కల్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తుతోంది.
‘‘ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఒక్క ఛాన్స్ వస్తే ఆయనతో ఓ సినిమా చేయాలనుంది’’ అని అన్నట్టుగా తన మనసులోని మాటను బయటపెట్టినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇటీవలే ఓ పబ్లిక్ ఫంక్షన్ కి అటెండ్ అయిన ఎక్స్ ప్రెస్ భామ... ‘‘టాలీవుడ్ లో మీకు నచ్చిన హీరో ఎవరూ?’’ అని ప్రశ్నిస్తే... ‘‘నాకు పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయనతో నటించే అవకాశం వస్తే చేయాలనుంది’’ అని చెప్పింది.
సాధారణంగా స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాల్లో ముందుగా హీరోనే తమకు ఏ హీరోయిన్ కావాలన్న విషయాన్ని చెబుతారు. దర్శకనిర్మాతలు ముందుగా హీరోతో చర్చలు జరిపిన తరువాతే హీరోయిన్ ను తీసుకుంటారు. అందువల్లే టాలీవుడ్ లో వున్న చిన్న సినిమాల హీరోయిన్ల నుంచి స్టార్ హీరోయిన్లందరూ పవన్ కల్యాణ్ ను వలలో పడేసేందుకే ఇటువంటి ట్రిక్కులు ప్లే చేసుకుంటున్నారని సినీ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. మరీ పవన్ కల్యాణ్ తన మీద పడుతున్న హీరోయిన్లను పైకి లేపుతాడా... లేదా...? అన్న ప్రశ్న ప్రతిఒక్కరి మదిలో తిరుగుతోంది.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more