Raveena tandon at 39 still ready to romance with youth

Raveena Tandon at 39 still ready to romance with youth, Raveena in romantic scenes in Shaab movie. Director Onir makes Raveena romance with youth

Raveena Tandon at 39 still ready to romance with youth

39లో కూడా కుర్రకారుతో రొమాన్స్ కి సిద్ధపడ్డ తార

Posted: 06/29/2014 01:16 PM IST
Raveena tandon at 39 still ready to romance with youth

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నది సినిమా తారల విషయంలో వర్తిస్తుంది.  ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన తారలు పెళ్ళైపోయి కాస్త వళ్ళు చేసి పిల్లలను కని, అయ్యో అవకాశాలు పోగొట్టుకున్నానే అని బాధపడటం కద్దు.  అందుకే అంటారు అదృష్టం ఒక్కసారే తలుపుతడుతుందని.  మరోసారి అలాంటి అవకాశాలు చాలా కొద్దిమందికే వస్తాయి.  అందులో చాలా కొద్ది మందే ఆ అవకాశాన్ని చేజార్చుకోకుండా సద్వినియోగం చేసుకుంటారు- అది అక్క పాత్రే కానీ, అత్త పాత్రే కానీ, లేదా కుర్రకారుని వలపుల్లో బంధించే పాత్రే కాని!

హిందీ సినిమారంగంలో అలా డింపుల్ కపాడియాకి, రేఖాకి, సంగీతా బిజ్లానీ, రవీనా టండన్ కి అవకాశాలొచ్చాయి.  ఐశ్వర్యా రాయ్ కూడా మరోసారి తెరమీదకు రావటానికి సన్నాహాలు జరుగుతున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి.  అయితే ఐశ్వర్యా రాయ్ వస్తే మళ్ళీ యువ తారగానే వస్తుంది కానీ శ్రీదేవిలా వయసు ముదిరిన పాత్రలు తీసుకోవటానికి ఇష్టపడకపోవచ్చు.  

కానీ రవీనా టండన్ కి, సంగీతీ బిజ్లానీకి వచ్చిన అవకాశం కన్నెపిల్ల పాత్ర పోషణకు కాదు.  వయసులో ముదిరినా యువకులతో విచ్చలవిడిగా తిరిగే పాత్ర.  అందులో ముద్దు మురిపాలు ఈ కాలం ప్రేక్షకులకు అనుగుణంగా ఉంటాయని తెలిసి సంగీతా బిజ్లానీ వెనకడుగు వేసిందట.  కానీ రవీనా టండన్ మాత్రం కుర్రకారుతో శృంగారపు సన్నివేశాలకు, సందర్భాన్నిబట్టి అధరాలను అందించటానికి సై అందట.  

ఈ విషయంలో దర్శకుడు ఒనిర్ మాట్లాడుతూ, సంగీతా బిజ్లానీలా రవీనా పారిపోదన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు.  ఎందుకంటే దర్శకుడు ఆ సినిమాలో సన్నివేశాలు ఎంత శృంగార భరితంగా ఉంటాయో ముందే వివరించి ఆమె అంగీకారం తీసుకున్నారట.  

హిందీలో పూరీ జగన్నాథ్ తీసిన 'బుడ్ఢా హోగా తేరా బాప్' సినిమాలోను, తెలుగులో ఈ మధ్య తీసిన 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలోను రవీనా టండన్ తనేమీ కుర్ర తారలకు తీసిపోనని నిరూపించుకుంది.  ఇంతకీ సినిమా పేరు 'షాబ్'.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles