(Image source from: leader heroine priya anand dating with music director anirudh)
ప్రియా ఆనంద్... ఈ పేరు తెలుగు చిత్ర పరిశ్రమకు సుపరిచితమే అయినా చాలామందికి గుర్తుండదు. అదే లీడర్ సినిమాలో రానా సరసన నటించిన ప్రియా ఆనంద్ అంటే.. ఇట్టే గుర్తు పట్టేస్తారు. తెలుగుతెరకు లీడర్ సినిమాతో పరిచయమైన ప్రియా... ఆ తరువాత రెండు, మూడు సినిమాల్లో నటించినప్పటికీ ప్రేక్షకులను అంతగా ఆకర్షించలేకపోయింది. కోలీవుడ్, బాలీవుడ్ లలో అవకాశాలు వచ్చినా ఫలితం మాత్రం శూన్యమే మిగిలింది!
ఏ అవకాశాలు లభించకపోవడంతో ఖాళీగా వున్న ఈ అమ్మడు... తాజాగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రేమలో పడిందని సమాచారం వినిపిస్తోంది. ‘‘కొలవరీ డీ’’ అనే పాటతో యావత్తు ప్రపంచం మొత్తం మీద సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిరుధ్ తో ప్రేమాయణం నడుపుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో హల్ చల్ చేస్తున్నాయి.
అందులో ప్రియా ఆనంద్ లవ్ సింబల్ లో వున్న బెలూన్ ను పట్టుకుని అనిరుధ్ కి ఇస్తున్నట్టుగాను.. అనిరుధ్ దానిని స్వీకరిస్తున్నట్టుగా పోజిచ్చారు. ఈ ఫోటోలను తిలకించిన నెటిజన్లందరూ వీరిద్దరూ పీకల్లోతు దాకా ప్రేమలో మునిగిపోయారని... అందుకే తమ హాలిడే లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి గుట్టుచప్పుడు కాకుండా ఇలా షికార్లకు వెళ్లారని చెప్పుకుంటున్నారు.
అయితే ఈ వార్తను తెలుసుకున్న ప్రియా ఆనంద్.. తన ప్రేమ వ్యవహారాన్ని ఖండిస్తూ వ్యాఖ్యలు చేసింది. అందరు హీరోయిన్లలాగే ఈమె కూడా తమ మధ్య ఏమీ లేదంటూ చెప్పుకొచ్చింది. ‘‘మేము చాలా మంచి స్నేహితులం. మామధ్య ఎలాంటి సంబంధం లేదు. ఆ ఫోటో కూడా ఒక పార్టీకి అటెండ్ అయి వస్తుండగా.. జస్ట్ క్యాజువల్ గా తీసుకున్నాం. అంతేకానీ.. లేనిపోని రాద్ధాంతాలు సృష్టించకండి’’ అని గుర్రుగా సమాధానం ఇచ్చింది.
తమిళ చిత్ర పరిశ్రమలో కూడా వీరిద్దరికి సంబంధించి ఘాటుగానే చర్చించుకుంటున్నారు. గతంలో అనిరుధ్ కొన్నాళ్లవరకు నటి ఆండ్రియాతో ప్రేమాయణం సాగించి వదిలేశాడని... ప్రియా ఆనంద్ పరిస్థితి కూడా అలాగే అవుతుందని చెప్పుకుంటున్నారట! ఏదిఏమైనా ఈ కుర్రాడు మాత్రం చిన్నాపెద్దా అని తేడా లేకుండా ఎవరినిపడితే వారితో డేటింగ్ లు చేస్తున్నాడంటూ సినీ విశ్లేషకులు గుసగులాడుకుంటున్నారు!
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more