Tamanna bhatia gave the party to humshakals movie for future movie offers

Tamanna bhatia gave the party to humshakals movie for future movie offers,

Tamanna bhatia gave the party to humshakals movie for future movie offers

సినిమా అవకాశాలకోసం ట్రిక్కులు ప్లే చేస్తోంది!

Posted: 06/24/2014 03:01 PM IST
Tamanna bhatia gave the party to humshakals movie for future movie offers

(Image source from: Tamanna bhatia gave the party to humshakals movie for future movie offers)

అవును... మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు సినిమా అవకాశాల కోసం తహతహలాడుతోంది. తెలుగు, తమిళ భాషల్లో కొన్నాళ్లవరకు రాజ్యమేలిన తమన్నా... తన రెమ్యునరేషన్ ని అమాంతంగా పెంచేసి, అవకాశాలు తగ్గించుకుంది. తెలుగులో సినిమా ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసిన ఈ భామకు... అర, ఒకటి సినిమా అవకాశాలు మాత్రమే వచ్చాయి. అయితే అవి కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడడంతో ‘‘ఐరన్ లెగ్’’ లేడీగా కిరీటం సంపాదించుకుంది. దీంతో దర్శక నిర్మాతలు ఈమె నుంచి కొంచెం దూరంగా వున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

తాజాగా ఈమె నటించిన ‘‘హమ్ షకల్స్’’ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ... అందులో ముగ్గురు హీరోల వున్న క్యూరియాసిటీ కారణంగా... బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. కానీ ఇందులో తమన్నా నటన మాత్రం అంత ఆకర్షణీయంగా లేదని, కేవలం అందంగా వున్నంతమాత్రాన నటీనటులు అయిపోరని అందరూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు... సినిమా షూటింగ్ నేపథ్యంలో యూనిట్ వర్గాలు అంతా కేవలం తమన్నాకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారని బెంగాల్ బ్యూటీ బిపాసా బసు కూడా ఫైర్ అయిందని... అందువల్లే ఆమె సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాలేదని యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు. అలాగే తమన్న వ్యవహారం కూడా షూటింగ్ సమయాల్లో అంతగా బాగులేదని, తనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించేందుకు యూనిట్ మెంబర్లు కూడా ఆమె మీద విమర్శలు ప్రారంభించారు.

ఈ విషయాలన్నీ ఆ నోట, ఈ నోట నలుగుతూ... చివరికి తమన్నా చెవిన వచ్చి పడ్డాయి. తాను నటించిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర బారీ ఫ్లాపులు కావడం, సినీ దర్శకనిర్మాతల నుంచి విమర్శలు రావడం తెలుసుకున్న తమన్నా... తన తప్పును సరిదిద్దుకునేందుకు కొత్త పద్ధతులను అవలంభిస్తోంది. నలుగురిలో మంచి పేరును సంపాదించేందుకు, దర్శకనిర్మాతల కంట పడేందుకు ట్రిక్కులు ప్లే చేస్తోంది.

తాజాగా తమన్నా తాను నటించిన ‘‘హమ్ షకల్ప్’’ మూవీ యూనిట్ సభ్యులకు ముంబైలో ప్రత్యేకంగా కాక్ టైల్ పార్టీ ఇచ్చినట్టు సమాచారం! ఈ పార్టీకి ఎలాగైనా హాజరు కావాలని తన మూవీ యూనిట్ మెంబర్లను ఒక్కొక్కొర్ని సాదరంగా పిలిచిందని ఫంక్షన్ కు హాజరయ్యినవారు చెప్పుకున్నారట! అయినా... సినిమా అంత ఘోరంగా ఫ్లాయినప్పటికీ.. తమన్నా ఇలా పార్టీ ఇవ్వడమేంటని కొంతమంది అనుకుంటుంటే... తమన్నా వాటినేమీ పట్టించుకోవడం లేదట! బహుశా రాబోయే రోజుల్లో మరిన్ని సినిమా అవకాశాలను సొంతం చేసుకోవడానికి ఈ విధంగా పార్టీలు ఇస్తోందంటూ సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles