Allu arjun and trivikram movie title is kavacham

Kavacham,Allu Arjun movies,Allu Arjun Kavacham,allu arjun films,Allu Arjun

The filmmakers are considering Allu Arjun-trivikram movie title Kavacham. as per the latest buzz in the tinsel town.

త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ఆ టైటిల్ కొట్టేశారు

Posted: 06/21/2014 11:22 AM IST
Allu arjun and trivikram movie title is kavacham

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్. ఈయనతో సినిమాలు తీయడానికి చాలా మంది క్యూలో ఉన్నారు. ఈయన దర్శకత్వం వహించిన ‘అత్తారింటికి దారేది ’ సినిమా టాలీవుడ్ ఇండస్ట్ర్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో జరుపుకుంది. ‘జులాయి ’ లాంటి హిట్ సినిమా తరువాత రిపీట్ అవుతున్న వీరి కాంబినేషన్ పై జనాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

త్రివిక్రమ్ ఈ సినిమా కోసం తన సెంటిమెంట్ హీరోయిన్స్ అయిన సమంతా, ప్రణీత తో పాటు మరో హీరోయిన్ తీసుకుంటున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ సినిమా స్టోరీలు మాత్రం రాసుకుంటున్నాడు గానీ టైటిళ్ళు మాత్రం పెట్టుకోవడం లేదు. అందుకే పక్క హీరోల టైటిళ్ళను కొట్టేసే పనిలో పడ్డాడు. టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘కవచం ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

‘కవచం ’ టైటిల్  తో రానా హీరోగా అందాల రాక్షసి ఫేం హ‌ను రాఘ‌వ పూడి ఓ సినిమా చేస్తున్నారనే ప్రచారం జరిగింది కానీ...అది నిజరూపం దాల్చలేదు. ఇపుడు అదే టైటిల్ ని బన్నీ-త్రివిక్రమ్ మూవీకి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సినీ జనాలు మాత్రం త్రివిక్రమ్ స్టోరీలైతే రాసుకుంటాడు గానీ, టైటిళ్లు పెట్టుకోక పక్కవాళ్ళ వాటి పై కన్నేస్తాడని అంటున్నారు. ఇదే టైటిల్ ని ఫైనల్ చేస్తారో ? పవన్ సినిమాకు మార్చినట్లు పలు టైటిళ్ళు మార్చుతారో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles