Venkatesh multi starrer with ravi teja

Venkatesh Multi starrer with Ravi Teja, Venkatesh one more mutli starrer, Ravi teja-venkatesh multi starrer

Venkatesh Multi starrer with Ravi Teja, Venkatesh one more mutli starrer, Ravi teja-venkatesh multi starrer

వెంకీ రవితేజల మల్టీస్టారర్ సినిమా

Posted: 06/21/2014 09:12 AM IST
Venkatesh multi starrer with ravi teja

టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేశ్ సీనియర్ హీరో కావడం, యంగ్ హీరోల జోరు ఎక్కువ కావడంతో సోలో చిత్రాలు చేయడానికి దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నా, మార్కెట్ రిత్యా వెంకటేష్ వాటి పై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఆ మధ్య యంగ్ డైరెక్టర్ మారుతితో ‘రాధా ’ సినిమా ఓపెనింగ్ జరుపుకున్నా అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దీంతో సోలో చిత్రాల కన్నా మల్టీస్టారర్ చిత్రాల పై ఆయన దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

ఇది వరకు ప్రిన్స మహేష్ తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ’ యంగ్ హీరో రామ్ తో  ‘మాసాలా ’ చిత్రాలు చేసిన వెంకీ, ఇప్పుడు పవన్ తో ‘గోపాల గోపాల ’ చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.  ఇదిలా ఉండగానే మరో మల్టీస్టారర్ సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సారి మాస్ రాజా రవితేజతో సినిమా చేయబోతున్నాడట.

ఈ చిత్రానికి రవితేజకు ‘బలుపు ’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ‘పవర్ ’ సినిమా చేస్తున్న రవితేజ ఈ సినిమా తరువాత వెంకీ తో కలిసి నటించబోతున్నాడట. టాలీవుడ్ లో వీరిద్దరి సోలో సినిమాలకు మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపధ్యంలో వీరిద్దరు కలిసి సినిమా చేయడం సరైన నిర్ణయమే అని సినీ జనాలు అంటున్నారు. రానున్న కాలంలో రవితేజ కూడా వెంకీ లాగ మల్టీస్టారర్ లో నటిస్తే మరి కొంత కాలం టాలీవుడ్ లో ఉండవచ్చు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles