Akhil akkineni says sorry to fans

Akhil Akkineni Says Sorry to fans, Akhil Akkineni sorry tweet, Akhil Akkineni debut movie, Akhil Akkineni debut movie details.

Akkineni Akhil has grabbed the attention of movie buffs with his mind blowing intro in blockbuster film Manam.

అఖిల్ చేసిన తప్పు ఏమిటి ?

Posted: 06/20/2014 03:15 PM IST
Akhil akkineni says sorry to fans

అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని అఖిల్ క్షమాపణలు చెప్పేశాడు. ఎవరూ అడగక ముందే క్షణమాపణలు చెప్పేంత తప్పు ఏం చేశాడు ? ఎందుకు సారీ చెప్పుకోవాల్సి వచ్చింది ? తెలుసుకోవాలంటే మేటర్ లోకి వెళ్ళాల్సిందే.  విషయం ఏంటంటే... అఖిల్ టాలీవుడ్ తెర పై ఈ సంవత్సరమే అరంగ్రేటం చేయబోతున్నానని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కొన్ని రోజుల్లోనే చెప్పబోతున్నానని ‘మనం ’ సినిమా విడుదల తరువాత ఇచ్చిన ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు.

అప్పటి నుండి అఖిల్ తన చిత్రం పై ఎప్పుడెప్పుడు ప్రకటన చేస్తాడా అని అక్కినేని అభిమానులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కానీ దాదాపు నెల రోజులు కావస్తున్న ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేయదు. దీని పై ఫ్యాన్స్ ఎటువంటి కామెంట్స్ గానీ, క్షమాపణ చెప్పమని అడగకున్నా.... ‘‘అందరూ నేను ఏం చెబుతానోనని ఎదురు చూస్తున్నారని తెలుసు. నాక్కూడా ఇలా ఆల‌స్యం చేయ‌డం న‌చ్చడం లేదు. కానీ సినిమాకి ముందు చేయాల్సిన క‌స‌ర‌త్తులు చాలా ఉన్నాయి.

వాటి ప‌నుల్లో ఉన్నా బిజీగా ఉన్నాను. అందుకే ఈ ఆల‌స్యం.. దానికి నేను సారీ చెబుతున్నా... అంటూ అఖిల్ తాజాగా ట్వీట్ చేశాడు. అభిమానులను అర్థం చేసుకొని అఖిల్ సారీ చెప్పడం వరకు బాగానే ఉన్నా, తొందర పడక పోవడం చాలా మంచింది. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ నుండి మరో ఫ్యూచర్ స్టార్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఈయన పై అభిమానులకు భారీ అంచనాలు ఉంటాయి. అదీ కాకుండా నాగార్జున అఖిల్ విషయంలో చైతూ లాంచింగ్ లో జరిగిన తప్పు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం నటనలో, డాన్సుల్లో శిక్షణ పొందుతున్న అఖిల్ తొందరపడక పోవడమే మంచిందేమో ???

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles