Balakrishna denise all the rumors

Balakrishna denise all the Rumors, tollywood, balakrishna, k raghavendra rao, Mokshagna debut movie, Mokshagna in balayya 100th film

Balakrishna son Mokshagna making an entry into Tollywood through a cameo in his father 100th film. However, things have got a clear picture now. Balakrishna has rubbished all the rumors and mentioned that Mokshagna will not be a part of his 100th film.

మోక్షజ్ఞ విషయంలో అబద్దం ఆడాడా ???

Posted: 06/18/2014 01:38 PM IST
Balakrishna denise all the rumors

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. బాలయ్య రాజకీయాల్లోకి వచ్చినా తన వృత్తి ధర్మం అయిన సినిమాల్లో నటించడం మాత్రం మానేయలేదు. ప్రస్తుతం 98వ చిత్రం చేస్తున్న ఆయన 100 సినిమాలు చేసే వరకు విశ్రమించడేమో ? అందుకే సత్యదేవ దర్శకత్వంలో   త్రిష హీరోయిన్ గా నటిస్తున్న  ఈ సినిమా ప్రస్తుతం అరకులో షూటింగు జరుపుకుంటుంది.

ఇంత వరకు బాగానే ఉన్న బాలయ్య నటించబోయే సినిమాలో ఆయన కొడుకు మోక్షజ్ఞ గెస్ట్ రోల్ చేయబోతున్నాడని, ఆ సినిమా ద్వారానే ఈయన తెలుగు తెర అరంగ్రేటం చేయబోతున్నాడని గత కొన్ని రోజుల నుండి గాలి వార్తలు చెక్కర్లు కొడుతున్న తెలిసిందే. ఈ వార్తల పై బాలయ్య స్పందిస్తూ.. మోక్షజ వందో సినిమాలో నటించడం లేదని, అవన్నీ పుకార్లే అని తేల్చడమే కాకుండా, మోక్షజ్ఞ ఎంట్రీ 2016లోనే ఉంటుందని తేల్చి చెప్పాడు.

ఇటీవల వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మనం ’ లో అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ గెస్ట్ రోల్ ద్వారా ఎంట్రీ  క్రేజ్ తెచ్చుకున్న ధరిమిలా బాలాయ్య కొడుకు కూడా తాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించబోయే సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే వార్తలు వచ్చాయి. మరి బాలయ్య ఇచ్చాక అయినా ఈ పుకార్లకు పుల్ స్టాప్ పడుతుందో లేదో ? కానీ బాలయ్య ఇలాంటి వార్త చెప్పడంతో ఆయన అభిమానులు బాగా డిస్సప్పాయింట్ అయ్యారని మాత్రం చెప్పవచ్చు.

మొదట ‘మనం ’ లో  ఉన్నాడని వార్తలు వచ్చినప్పుడు  నాగ్ కూడా ఇలానే స్పందిస్తూ .. అబద్దం చెప్పాడు. ఇప్పుడు బాలయ్య కూడా మోక్షజ్ఞ విషయంలో అబద్దం చెప్పలేదు కదా ???

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles