Akkineni manam movie to break pawan ad records

Manam movie to break Pawan AD records, manam box office collection,25 crore mark, manam movie overseas collections, race gurram,dookudu,allu arjun,akkineni,mahesh babu, attarintiki daredi movie collections.

Akkineni multi starrer Manam movie to break Pawan AD records.

పవన్ సినిమా రికార్డుల్ని బద్దలు కొట్టబోతుంది ?

Posted: 06/05/2014 10:25 AM IST
Akkineni manam movie to break pawan ad records

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు పాత రికార్డులను బద్దలు కొడుతూ... కొత్త కొత్త రికార్డులసు క్రియేట్ చేస్తున్నాయి. బాక్సాఫీసు కలెక్షన్ల పరంగా ఇప్పటి వరకు 100 కోట్లు మార్క్ ని టచ్ చేయని టాలీవుడ్ సినిమా ఆ రికార్డును పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది ’ సినిమా టచ్ చేస్తుందని అందరు అనుకున్నారు.

కానీ ఆ సినిమాకు అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన కారణంగా 80 కోట్ల వసూళ్లు సాధించి టాలీవుడ్ లో అత్యథిక వసూళ్ళు సాధించిన తొలి సినిమాగా ఘనత సాధించడమే కాకుండా, పవన్ మేనియాతో విదేశాల్లో సైతం 11.25 కోట్లతో హైయెస్ట్ వసూళ్ళు సాధించిన సినిమాగా రికార్డ్స్ లో ఎక్కగా, ఆ రికార్డుల్ని బ్రేక్ చేయడానికి రెడీ అవుతుంది అక్కినేని ఫ్యామిలీ త్రయం కలిసి నటించిన ‘మనం ’ సినిమా. టాలీవుడ్ లో ఇటీవలి కాలంలో వచ్చిన సినిమాల్లో ఆణిముత్యంగా, మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా తొలి 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల వసూళ్ళను సాధించింది.

ఓవర్సీస్ లో పవన్ అత్తారింటికి దారేది 11.25, మహేష్ 9.35 దూకుడు సినిమాలకు దగ్గరగా ‘మనం ’ తొలి వారంతోనే 8.04 కోట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. మరో రెండు రోజుల్లో రెండు వారాలు పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమా వసూళ్ళు ఇప్పటికీ నిలకడగా ఉన్నాయి. ఈ వసూళ్లు ఇలాగే కొనసాగితే పవన్ సినిమా ఓవర్సీస్ రికార్డుల్ని బ్రేక్ చేయడం ఖాయం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఇండియాలో వసూళ్ళు ఇలాగే ఉంటే టాలీవుడ్ లో బడా హీరోల సినిమాల రికార్డులు కనుమరుగు చేయడమే కాకుండా, 100 కోట్ల క్లబ్ కి దగ్గరగా వెళ్ళుతుందని అంచనా వేస్తున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles