Miss india 2013 navneet kaur dhillon romance to pawan

Navneet Kaur Dhillon Romance to Pawan,pawan kalyan,navneet kaur dhillon,miss india world 2013,gabbar singh 2,miss india, Navneet Kaur Dhillon Gabbar Singh 2, Miss India Navneet Kaur Dhillon Gabbar Singh 2

Miss India India World 2013 Navneet Kaur Dhillon will romance Pawan Kalyan in Gabbar Singh-2 movie.

పవన్ కి ఈ మిస్ ఇండియా హిట్టిచ్చేనా ?

Posted: 05/30/2014 05:21 PM IST
Miss india 2013 navneet kaur dhillon romance to pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో విస్త్రుత ప్రచారం చేసి, ప్రస్తుతం ఫారిన్ ట్రిప్ లో ఉన్నాడు. అక్కడి నుండి వచ్చిన తరువాత తన వ్రుత్తి అయిన సినిమాల్లో బిజీ అయిపోనున్నాడు. పవన్ కళ్యాణ్ చేయబోయే గబ్బర్ సింగ్ - 2 సినిమా ఎప్పుడో పూజా కార్యక్రమాలు జరుపుకున్నా, ఇంత వరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నా, అందులో మొదటిది హీరోయిన్ దొరక్కపోవడమే. గతంలో ఈ సినిమాలో నటిస్తున్నట్లు చాలా మంది పేర్లు వినిపించినా ఎవరు ఫైనల్ కాలేదు.

ఎట్టకేలకు ఈ సినిమాకు తాజాగా హీరోయిన్ ని ఫైనల్ చేశారని సినిమా వర్గాల సమాచారం. ఈ సినిమా కోసం మిస్ ఇండియా2013 కవనీత్ కౌర్ ని ఆడిషన్స్ నిర్వహించి మరీ ఓకే చేశారట. ఇటీవల ముంబై వెళ్ళిన సంపత్ నంది ఆమెకు కథను వినిపించి, ఆడిషన్స్ నిర్వహించి, పవన్ ప్రక్కన పక్కాగా సూట్ అవుతుందని భావించి ఆమెకు అడ్వాన్స్ కూడా కొట్టేసి వచ్చాడట. అంటే దాదాపుగా ఈ అమ్మడు ఫైనల్ అయినట్లే లెక్క. ఒకవేళ ఇదే నిజం అయితే పవన్ కళ్యాణ్ ప్రక్కన నటిస్తున్న రెండో మిస్ ఇండియా అవుతుంది.

గతంలో పంజా సినిమాలో 2007 మిస్ ఇండియాగా ఎంపికైన సారాజైన్ నటించింది. ఆ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో అడ్రస్ లేకుండా పోయిన మాట అటుంచితే పవన్ ఖాతాలో ప్లాప్ వచ్చి పడింది. ఈ విషయం తెలిసి కూడా మళ్ళీ దర్శకుడు మిస్ ఇండియానే సెలక్ట్ చేశాడు.

ఇక్కడ మనం విషయం నిశితంగా పరిశీలిస్తే... మన టాలీవుడ్ కథానాయకులు ఈ మధ్యన ఎక్కువ మిస్ ఇండియాల వెంట పడుతున్నట్లు అనిస్తుంది. మంచు మనోజ్ సరసన 2008 మిస్ ఇండియా సిమ్రాన్ కౌర్ నటిస్తే, త్వరలో కళ్యాణ్ రామ్ నటించబోయే సినిమాలో 2012 మిస్ ఇండియా వన్యా మిశ్రా ను తీసుకున్నారు. ఈ మిస్ ఇండియాలు మన హీరోల హిట్టు గ్రాఫ్ ను పడేస్తారో ? లేపుతారో ? చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles