Mahesh babu most desirable man in 2013

Times 50 Most Desirable Men,Sonam Kapoor,Salman Khan,Mahesh Babu,Hrithik Roshan

India has voted and chosen the Times 50 Most Desirable Men of 2013. The 7.34 lakh votes received online.

ఇండియన్స్ ఎక్కువ కోరేది మహేష్ నే

Posted: 05/23/2014 07:19 PM IST
Mahesh babu most desirable man in 2013

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు ‘1 నేనొక్కడినే’ సినిమా సరైన విజయాన్ని అందించకపోయినప్పటికీ... భారతదేశంలో మాత్రం మహేష్ ఘనవిజయం సాధించాడు. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న మహేష్ కు అగ్రస్థానం దక్కింది. ప్రముఖ టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ ఇటీవలే ఓ సర్వే నిర్వహించింది. భారతదేశంలోని ఓ 50 మంది ప్రముఖుల పేర్లను తీసుకొని, వారిలో జనాలు ఎక్కువగా ఎవరిని కోరుకుంటున్నారని సర్వే నిర్వహించారు. అందులో భాగంగా మన టాలీవుడ్ ప్రిన్స్ కు మొదటి స్థానం లభించింది.

గతంలో టాప్ 5 స్థానాలలో పోటీగా నిలుస్తూ వస్తున్న మహేష్ ఈసారి ఏకంగా అగ్రస్థానాన్ని చేరుకున్నాడు. ఈ సర్వేలో మొత్తం 7.34 లక్షల మంది ఓట్లు వేశారు. అందులో మహేష్ మొదటిస్థానంలో నిలవగా, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ రెండవ స్థానం దక్కించుకున్నాడు. అసలే అమ్మాయిలలో మహేష్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే ఇతర హీరోల్లో అంతగా లేదనే చెప్పుకోవాలి. ఎప్పుడూ ఎలాంటి విషయాల్లో తలదూర్చకుండ, తన పనేంటో తానూ చేసుకొని వెళ్లే మనస్థత్వం కలవాడు అంటూ చాలా మంది టాలీవుడ్ ప్రముఖులే చెప్పడం కాకుండా మహేష్ తో నటించిన బాలీవుడ్ హాట్ భామలు సైతం మహేష్ కు ఫిదా అయిపోయారు.

తన ప్రతి సినిమా విజయానికి కారణమని చెప్పే మహేష్... ఈ వార్త విని చాలా సంతోషించాడు. తనను ఇంతగా అభిమానిస్తూ, తనకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ ఈ సంధర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ, తన సినిమాలన్నీ కూడా అభిమానులను అలరించడానికే అని మహేష్ తన సంతోషాన్ని తెలియజేసాడు. మహేష్ ప్రస్తుతం ‘ఆగడు’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles