Ntr rabhasa movie first look posters

rabhasa movie first look, rabhasa movie first look stills, ntr rabhasa movie first look, rabhasa movie first look hd stills, ntr movie stills, ntr rabhasa hd stills, rabhasa movie news

rabhasa movie first look, rabhasa movie first look stills, ntr rabhasa movie first look, rabhasa movie first look hd stills, ntr movie stills, ntr rabhasa hd stills, rabhasa movie news

బన్నీని కాపీ కొట్టిన ఎన్టీఆర్

Posted: 05/19/2014 05:15 PM IST
Ntr rabhasa movie first look posters

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ ఇప్పటికే విడుదలై మంచి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ప్రతి సినిమా విడుదలకు ముందుగానే ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ఫోటోలను విడుదల చేస్తుంటారు. అల్లు అర్జున్ కూడా ‘రేసుగుర్రం’ కోసం యాక్షన్ తరహాలో, మాస్ లుక్ లో కనిపించడానికి కొత్తగా పోస్టర్లను డిజైన్ చేయించాడు. ఈ పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే ‘రేసుగుర్రం’ పోస్టర్లలో బన్నీ కనిపించిన మాస్ లుక్కును యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాపీ కొట్టాడు.


ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రభస’. రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు. తన పుట్టినరోజు సందర్భంగా ‘రభస’ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలను విడుదల చేశారు. అందులో ఒక ఫోటో ‘రేసుగుర్రం’లో బన్నీ వలే ఉంది. ఫోటో మార్ఫింగ్ చేశారేమో అనేంతగా ఎన్టీఆర్ రభస ఫోటో కనిపిస్తుంది. ఇద్దరి మొహాలలో కూడా ఒకే విధమైన ఎమోషన్, ఒకే రకమైన కాస్ట్యూమ్... ఇలా ప్రతి ఒక్కటి కూడా కలిసిపోవడంతో బన్నీని ఎన్టీఆర్ కాపీ కొట్టాడేమో అనే అనుమానం వస్తుంది.

బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే నెలలో ఆడియో విడుదల చేసి, త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles