Pawan kalyan son debut in gabbar singh 2

Pawan Kalyan son in Gabbar Singh 2, Akira Nandan debut in Gabbar Singh 2, Akira Nandan Gabbar Singh 2, Akira nandan entry in telugu film

Pawan Kalyan Renu Desai son Akira Nandan all set to make his debut in films.

పవన్ పై మాజీ భార్య ఒత్తిడి...

Posted: 05/15/2014 07:03 PM IST
Pawan kalyan son debut in gabbar singh 2

టాలీవుడ్ స్టార్ హీరోల కుమారులను, కూతుళ్ళను చిన్న వయస్సులోనే వెండితెరకు పరిచయం చేసి, ఇప్పటి నుండే వారు భవిష్యత్తు హీరోలు, హీరోయిన్లని చెప్పకనే చెప్పేప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. అలా ఇప్పటి వరకు చాలా మంది హీరోల, దర్శకుల పిల్లలు వెండితెర పై కనిపించి అలరించారు కూడా. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ కుమారుడు గౌతమ్ ‘1 ’ నేనొక్కడినే సినిమాతో వెండితెర ఎంట్రీ మంచి మార్కులు కొట్టేశాడు.

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ని వెండితెరకు పరిచయం చేయాలని తెర వెనక ఆయన తల్లి రేణుదేశాయ్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ నుండి దూరం అయిన తరువాత నిర్మాతగా మారిన రేణు దేశాయ్ గత కొన్ని రోజులుగా పవన్ గురించి కామెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల ఆయన పార్టీ స్థాపించినప్పుడు కూడా పొగడ్తలు కురిపించిన ఆవిడ కొడుకు విషయంలో పవన్ పై చాలా ఒత్తిడి తెస్తుందట.

పవన్ ఇప్పటికే కమిట్ అయ్యిన గబ్బర్ సింగ్ - 2  లో అకీరా నందన్ తో చిన్న పాత్ర అయినా చేయిస్తే బాగుంటుందని, ఒకవేళ పవన్ పూర్తిగా సినిమాలకు దూరం అయితే ఈయన సినిమాలో నటిస్తే వచ్చే స్టార్ డమ్ తో భవిష్యత్తులో మంచి హీరోగా ఎదిగే అవకాశాలున్నాయని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు. మరి రేణు దేశాయ్ కోరికను పవన్ తీరుస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles