Baahubali story copied from marmayogi

Baahubali Story Copied, Baahubali story inspired by Marmayogi, Prabhas and Rana Daggubati starrer, NTR and MGR, Telugu and in Tamil versions

Rajamouli Bahubali is loosely based on the yesteryear film Marmayogi.

జక్కన్న బాహుబలి స్టోరీ కాపీనా ?

Posted: 05/06/2014 03:54 PM IST
Baahubali story copied from marmayogi

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘బాహుబలి ’ పై జనాలు ఎంతో ఆసక్తితో ఉన్నారు. దానికి కారణం ఇంత వరకు ఓటమంటూ ఎరుగుని దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండమే కాకుండా, ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా లాంటి స్టార్లు నటిస్తుండమే.

ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది ఇండస్ట్రీలో టాక్ ఆప్ ది టౌన్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా స్టోరీ 1951లో ఎన్టీఆర్, కాంతారావు క‌థానాయ‌కులుగా న‌టించిన ‘మ‌ర్మయోగి’ సినిమాకి పోలికలు ఉన్నాయని టాలీవుడ్ నుండి ఓ వార్త బయలు దేరింది. తమిళంలో ఎంజీఆర్, తెలుగు లో ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. రాజమౌళి ఆ సినిమా కథే నుండి స్ఫూర్తి పొంది చేస్తున్నాడని చెబుతున్నారు.

ఆసలు ఇంతకీ సినిమా కథ ఏమిటంటే.. రాజ‌కుమారుడు త‌న అస్థిత్వం కోసం పోరాటం చేయ‌డం సినిమా క‌థ‌. ఈ సినిమాలో కూడా ప్రభాస్, రాణాలు అస్థిత్వం కోసం పోరాటం చేస్తారని, వారిద్దరు అందులో అన్నదమ్ములుగా కనిపించబోతున్నారని అంటున్నారు.

ఈ సినిమా కథను రాజమౌళి ఆ కథ నుండే స్ఫూర్తి పొందినా, తనదైన స్టైల్లో తెరకెక్కిస్తున్నాడని, త్వరలో ఈ వార్తల పై రాజమౌళి స్పందించి, మర్మయోగికి దానికి సంబంధం లేదని చెబుతాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. అప్పటి దాకా ఏ వార్తలు, ఎన్ని ప్రచారాలు జరిగినా వినికుంటా ఉండాల్సిందే. ఏమంటారు మీరు.

knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles