Rakul preet singh act in pandaga chesko movie

Rakul Preet Singh Act with Ram, Rakul Preet Singh, Venkatadri Express, Gopichand Malineni , Mona Motwani, Pandaga Chesko

Rakul will be romancing Ram in his next, Pandaga Chesuko, which originally starred Hansika Motwani.

ఎక్స్ ప్రెస్ భామ పండగ చేస్కుంటుంది

Posted: 05/06/2014 12:51 PM IST
Rakul preet singh act in pandaga chesko movie

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ’ భామ రాకుల్ ప్రీత్ సింగ్ రయ్యిమంటూ టాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే గోపీచంద్, మంచు మనోజ్ సినిమాల్లో రాత్రి, పగలు డబుల్ డ్యూటీలు చేస్తూ నటిస్తున్న ఈ అమ్మడుకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. స్టార్ హీరో రామ్ త్వరలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోయే చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా సైన్ చేసింది.

మొదట ఈ చిత్రంలో రామ్ సరసన బబ్లీ బ్యూటీ హన్సికను తీసుకోవాలని ఆమెను సంప్రదించారు. గతంలో రామ్, హన్సిక నటించిన నటించిన ‘కందిరీగ ’ హిట్ కావడంతో మళ్ళీ అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తే బాగుంటుందని అనుకున్నారు. అయితే హన్సిక కు డేట్స్ కుదరక పోవటం తో ఈ చిత్రం నుంచి తప్పుకుంది.

తమిళ, తెలుగు సినిమాల్లో  హన్సిక ప్రస్తుతం బిజీగా ఉంది. ఆమె ప్రస్తుతం రవితేజ పవర్ చిత్రంలో నటిస్తోంది. చిత్రానికి ఈ సినిమాలో అనుకోని ఆఫర్ రావడంతో రాకుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎక్కువ శాతం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకు పరుచూరి ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న రామ్ కి, బలుపు సినిమా విజయం ఊపులో గోపిచంద్ హిట్టిస్తాడో లేదో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles