నటి త్రిష, నయనతార ఇద్దరూ క్రేజీ భామలే. ఇద్దరు అభినయరాణులే. ఇద్దరు అభిమానధనం గలవారే. అలాంటి వీరి ముఖాలు ఎప్పుడూ లేనంతగా కాంతులీనుతున్నాయి. అందుకు కారణం వీరి అనూహ్య కలయికనే. దీంతో ఇద్దరూ పరవశంతో కూడిన కౌగలింతలు చూపరులను ముచ్చటగొలిపాయి.
ఈ ఆనంద తరుణానికి ముంబయిలో జరిగిన ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం వేదిక అయ్యింది. నిజానికి త్రిష, నయనతార మధ్య మొన్నటి వరకు స్నేహం లేదు. మరీ చెప్పాలంటే ఒకరికొకరు శత్రువుల్లా ప్రవర్తించారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలతో కత్తులు దూసుకున్నంత పని చేశారు. వీరి కోల్డ్ వార్‌కు అపోహలే కారణం అంటూనే ఒకరి కొకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడం విశేషం. ఇప్పుడీ బ్యూటీలు ఏమంటున్నారో చూద్దాం.
మా మధ్య పోటీతత్వం పెరిగింది!
త్రిషను నేనెప్పుడైతే తొలిసారిగా కలిశానో అప్పటి నుంచి ఆమెను చెన్నై, హైదరాబాద్, బెంగళూరులలో ఎక్కడ కలిసినా ఒక మంచి స్నేహితురాలిగానే ట్రీట్ చేస్తూ వచ్చాను. మేమిద్దరం సినిమాలో ఇంచుమించు ఒక్కటిగానే ఎదుగుతూ వచ్చాం. అలాంటిది మధ్యలో కొందరి కథనాల వలన దూరమైన మాట నిజమే.
ఆ తరువాత ఇద్దరి మధ్య పోటీతత్వం పెరిగింది. కెరీర్ విషయంలో మేమిద్దరం చాలా మెచ్యూర్‌గా ప్రవర్తించాం. తాము చాలా కాలం క్రితం ఈ ఫిలింఫేర్ పార్టీలోనే కలిసి మాట్లాడుకున్నాం. త్రిష చాలా పాజిటివ్ పర్శన్. చాలా జాగ్రత్తతో పాటు జాలీగా ఉండే వ్యక్తి. పరిశ్రమలో పదేళ్లుగా తన స్థానాన్ని పదిల పరచుకుంటూ వస్తున్నారు. చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం నిలదొక్కుకున్న నటి త్రిష. ఈ విషయంలో ఆమెను చూసి గర్వపడుతున్నాన ని అన్నారు.
అంతా అభూత కల్పనలే!
నయనతార నేను కొంతకాలం శత్రువులుగా మసలుకున్న మాట నిజమే. అది కొందరి అభూత కల్పనలే. ఈ అపార్థాలకు దారితీసిన అపోహలన్నీ కరిగిపోయాయి. మేమిప్పుడు మంచి స్నేహితులం అయిపోయాము. నా తొలి చిత్రం విడుదలవుతుందంటే తొలి శుభాకాంక్షలు తెలిపేది నయనతారనే అని అంటోది త్రిష. వీరి నయా ఫ్రెండ్షిప్ చూసి అవాక్కు అవడం ప్రేక్షకులవంతయింది
RS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more