Hrithik roshan suzanne file divorce papers

sussanne wanted divorce,Sussanne Roshan,hrithik wanted patch up,Hrithik Roshan,file for divorce

Hrithik Roshan and Suzanne, the golden couple of Bollywood, have filed for divorce.

13 ఏళ్ళ బంధానికి బ్రేక్ లు వేశారు

Posted: 05/01/2014 06:46 PM IST
Hrithik roshan suzanne file divorce papers

బాలీవుడ్  స్టార్ హీరో హృతిక్ రోషన్ తన భార్య సుజానెతో మనస్పర్ధల కారణంగా విడిపోతున్నట్లు గత డిసెంబర్ 14వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి విడివిడిగా ఉంటున్న వీరు తాజాగా తామిద్దరికి అధికారికంగా విడాకులు కావాలని పరస్పర అంగీకారంతో ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న 17 సంవత్సరాల రిలేషన్ షిప్ కి, 13 సంవత్సరాల దాంపత్య జీవితానికి ముగింపు తెర పడినట్లు అయ్యింది.

తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు తెలపడంతో, కోర్టు ఆరునెలల్లోగా నిర్ణయాన్ని వెల్లడించనుంది. వీరి కేసు అక్టోబర్ 31వ తేదీన విచారణకు రానుంది. 13 సంవత్సరాల దాపంత్య బంధానికి ప్రతీకగా వీరిద్దరికి ఏడెళ్ల రెహాన్, ఐదేళ్ల హ్రిదాన్ ఇద్దరు కొడుకులున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ ఖాన్ కూతురైన సుజానేతో హృతిక్ వివాహం 2000లో జరిగింది.

వీరిద్దరి వివాహ బంధం విచ్చిన్నం కావడానికి మీడియాలో రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. సుజానేకి అత్త, మామలతో విబేధాలు తీవ్రస్థాయికి చేరుకోవడమే కారణం అని, హాలీవుడ్ నటి బార్బారా మోరీతో హృతిక్ సన్నిహిత సంబంధం కూడా విడిపోవడానికి కారణమైందని ఇలా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఏది ఏమైనా వీరిద్దరి బంధానికి తెర పడినట్లే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles