Puri jagannath jr ntr move title kummestha

puri jannath-ntr move, Kummestha movie, ntr movie title kummestha, puri-ntr combination, NTR Kummutha, NTR and PURI's Kummutha

Puri recently impressed NTR with a subject and is currently developing it.

వీరిద్దరు కలిసి ‘కుమ్మేస్తా ’రట

Posted: 04/21/2014 12:39 PM IST
Puri jagannath jr ntr move title kummestha

ఒకప్పుడు పూరీ జనగ్నాథ్ దర్శకత్వంలో సినిమా అంటే టాలీవుడ్ స్టార్ హీరోలు ఎంతో ఉత్సాహంగా చేయడానికి ముందుకు వచ్చేవారు. కానీ గత కొంత కాలం నుండి పూరీ సినిమాలు జనాలకు అంత పెద్దగా రుచించడం లేదు. దీంతో పెద్ద హీరోల చుట్టూ పూరీ ఒకటికి రెండు సార్లు తిరిగితే కానీ ఆయనకు ఛాన్స్ ఇవ్వడం లేదు.

అలాంటి పూరీకి దాదాపు పది సంవత్సరాల తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయడానికి ఛాన్స్ ఇచ్చాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఆంధ్రావాలా ’ సినిమా వచ్చి ప్లాప్ అయ్యింది. ఇన్నేళ్ళ తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్న పూరీ ఈసినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను బ్యాంకాక్ లో తయారు చేస్తున్నాడట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అయిన బండ్ల గణేశ్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకం పై భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నాడు.

త్వరలో సెట్స్‌పైకి రానున్న ఈ సినిమాకు కుమ్మేస్తా అనే పేరుని పరిశీలిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ రభస చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తరువాత పూరి-ఎన్టీఆర్‌ల సినిమా సెట్స్‌పైకి రానుందని చిత్ర వర్గాల సమాచారం. మరి సారైనా ఎన్టీఆర్ కి మంచి హిట్టిస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles