Nag and amala to participate in kbc show

Nagarjuna, Amala, KBC, KBC in Telugu, Nagarjuna KBC promotions, Nagarjuna to question Amala in KBC, Kaun Banega Crorepati, Nagarjuna as quiz master, Nagarjuna to team up with Amla

The Telugu version of the high successful Kaun Banega Crorepati, is all set to hit the small screen soon.

అమలను ప్రశ్నించబోతున్న నాగార్జున

Posted: 04/18/2014 01:38 PM IST
Nag and amala to participate in kbc show

బాలీవుడ్ బుల్లితెర పై ‘సోనీ ’ ఛానల్లో ప్రసారం అయ్యే ‘కౌన్ బనేగా కరోడ్ పతీ ’ ప్రోగ్రాం కి ప్రేక్షకుల నుండి ఎంత  రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ కి వ్యాఖ్యాతగా బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యవహరించాడు. ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ని టాలీవుడ్ బుల్లి తెర పై తెలుగు వర్షన్ ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ అనే పేరుతో లో ప్రసారం చేయబోతున్నారు.

ఈ కార్యక్రమం (ఏప్రిల్ 18) తేదీ అంటే నేటి నుండే మా టీవీలో ప్రసారం చేయబోతున్నారు. ఈ ప్రోగ్రామ్ ని నోవాటెల్ హోటల్‌లో ప్రారంభించబోతున్నారు. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ కార్యక్రమంలో పాల్గొనే తొలి అవకాశం నాగార్జున తన భార్య అమలకు కల్పించారట. తన భార్యను ఈ కార్యక్రమంలో కోటీశ్వరాలిని చేసేందుకు నాగార్జున ప్లాన్ చేసాడని, అందుకే ఆమెకు తొలి అవకాశం ఇచ్చాడనే ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

నలభై ఎపిసోడ్స్ గా వచ్చే ఈ ప్రోగ్రామ్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించినందుకు నాగార్జునకు దాదాపు మూడు కోట్లు ముట్టజెప్పుతున్నారట. ఎంత మాటీవీ ఛానల్లో నాగార్జునకు వాటా ఉంటే మాత్రం తన భార్యకే తొలి అవకాశం ఇవ్వాలా ? ఎవరైనా పేద మేధావులకు ఇస్తే వాళ్ళ అవసరాలు తీరుతాయి కదా అని అనుకుంటున్నారు జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles