Balakirhsna 100th movie with boyapati

Balakirhsna 100th movie with Boyapati, Legend Movie, Director Boyapati Srinu, RGV Rowdy movie, Mohanbabu Rowdy movie

Balakirhsna 100th movie with Boyapati

బాలయ్య వందవ సినిమా బోయపాటితో

Posted: 04/02/2014 03:42 PM IST
Balakirhsna 100th movie with boyapati

నందమూరి బాలకృష్ణ తన వందవ సినిమాకు బోయపాటి మీదనే ఆధారపడుతున్నారు. 

లెజెండ్ సినిమా విజయంతో బోయపాటి మీద నమ్మకం బాగా పెంచుకున్న బాలకృష్ణ తన వందవ సినిమాను సూపర్ హిట్ చెయ్యటం కోసం మళ్ళీ బోయపాటి భుజాల మీదనే ఆ భారం మోపుతున్నారు.  లెజెండ్ సినిమా సెలవు రోజులు దాటిన తర్వాత కూడా అదే స్థాయిలో వసూళ్ళు చేస్తుండటంతో ఆ సినిమా విజయ పథంలో దూసుకుపోతోందని చెప్పవచ్చు.  ఈ వారంలో మోహన్ బాబు విష్ణు నటించిన రామ్ గోపాల్ వర్మ సినిమా రౌడీ ఉన్నా, లెజెండ్ వసూళ్ళు చూస్తుంటే ఈ సినిమా ఢీలా పడేది లేదనిపిస్తోంది. 

రౌడీ సినిమా ప్రొమోలకు మంచి స్పందన వచ్చినా, ఆ సినిమా మొదటి వారాంతం తర్వాత కాని ఫలితం సరిగ్గా తెలియదు. 

ఏది ఏమైనా లెజెండ్ విజయాన్ని పూర్తిగా విశ్వసిస్తున్న బాలయ్య మాత్రం తన వందవ సినిమా కోసం మంచి స్క్రిప్ట్ తయారు చెయ్యమని బోయపాటికి పురమాయించినట్లు వార్త. 

అయితే, లెజెండ్ బాలయ్య 97 వ సినిమా మాత్రమే.  మరో రెండు సినిమాలు చేస్తేనేకాని ఆయన వందవ సినిమాలోకి అడుగుపెట్టలేరు!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles