Actor nagarjuna to host kbc in telugu

Nagarjuna, Akkineni Nagarjuna, Kaun Banega Crorepati, kbc, Actor Nagarjuna to host KBC in Telugu, Telugu version of Kaun Banega Crorepati,

Actor Nagarjuna to host KBC in Telugu

ప్రశ్నలతో పైసల్ సంపాదిస్తున్న నాగార్జున?

Posted: 03/22/2014 10:06 AM IST
Actor nagarjuna to host kbc in telugu

అందరు కష్టపడి పైసలు సంపాదిస్తారు. కానీ మన టాలీవుడ్  నాగార్జున మాత్రం అలా కాదు. గతంలో  బిజీనెస్ చేస్తూ  పైసల్  సంపాదించే నాగార్జున ఈసారి  కొంత బాట పట్టాడు.  కేవలం ప్రశ్నలు అడిగి డబ్బులు సంపాదించే పనిలో పడ్డాడు. విజ్ఞాన సంబంధిత ప్రశ్నలన్నా, వాటికి సంబంధించిన కార్యక్రమాలన్నా బాలీవుడ్ తో పోల్చుకుంటే మన వాళ్లకు ఆ ఇంటరెస్ట్ కొంచెం తక్కువే. అందుకే అక్కడ "కౌన్ బనేగా కరోడ్ పతి", "దస్ కా దమ్" వంటి షోలు బాగా పాపులర్ అయ్యాయి.

ఇక్కడ కూడా అడపాదడపా అటువంటి షో లు నిర్వహించి చేతులు కాల్చుకున్నారు. ఒక ప్రముఖ టి.వి ఛానల్ సాయికుమార్ ని హోస్ట్ గా ఇటువంటి గేమ్ షో ఒకటి కండక్ట్ చేసి నష్టపోయారు. ఇలాంటి వాటిల్లో కాస్తో కూస్తో పేరుతెచ్చుకున్న షో ఏంటీ అంటే ఝాన్సీ హోస్ట్ చేసిన 'బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర' అనే చెప్పుకోవాలి. 

ఇంత దారుణమైన రికార్డు వున్న తెలుగులో 'కౌన్ బనేగా కరోడ్ పతీ' సిరీస్ ను తెరకెక్కిస్తుండడం విశేషం. కొసమెరుపు ఏమిటంటే అక్కడ బిగ్ బి అమితాబ్, షారుఖ్ వంటి తారలు పోషించిన హోస్ట్ రోల్ ను ఇక్కడ కింగ్ నాగార్జున పోషించనున్నారు. అక్కడా ఇక్కడా పోల్చుకుంటూ వస్తే ఫాలోయింగ్ లో గానీ, స్టేజ్ ప్రజెన్స్ లో గానీ మన కింగ్ వాళ్ళ దరిదాపులకు కూడా రాలేడు. 

అయినా ఇంత మంచి అవకాశం రావడం నాగార్జున గారి అదృష్టమనే చెప్పాలి. చేతిలో సినిమాలు అయిపోయి ఖాళీ అవుతున్న తరుణంలో ఇది నాగార్జున వేస్తున్న గేమ్ ప్లాన్ అని మరికొందరి వాదన. చూద్దాం మన నాగ్ ఎలాంటి ప్రశ్నలు కురిపిస్తాడో.. ఎటువంటి చలోక్తులు వినిపిస్తాడో. అయినా ఏటుచూసిన నాగార్జున్ కు లాభమే. 

 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles