చెన్నై బ్యూటీ ఎప్పుడు ఎవరితో రొమాన్స్ చేస్తుందో చెప్పటం చాలా కష్టం. ఇప్పటికే ఉన్న సినిమాలతో చాలా బిజీ బిజీగా ఉన్న సమంతా. మరోసారి ‘ఆకతాయి’తో రొమాన్స్ చేయటానికి సిద్దపడినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ ఆకతాయి ఎవరు .. రామ్. దేవదాస్ హీరో, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాలా లాంటి సినిమాల్లో ఆకతాయిగా నటించిన హీరో రామ్. ఇప్పుడు ఎలాగైనా ఓ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లో కి వచ్చేయాలని డిసైడ్ అయ్యాడు.
ఈ వరుసలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని తో జత కట్టాడు. వీరి కాంబినేషన్ లో 'పండగ చేస్కో' అనే టైటిల్ తో ఓ చిత్రం ఖారారైంది. పూర్తి కమర్షియల్ హంగులున్న చిత్రమిది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇదీలావుంటే రామ్ మరో స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడు రామ్ కు ఓ కధను చెప్పాడట. వేణు చెప్పిన కథ రామ్‌కి బాగా నచ్చి ఈ చిత్రాన్ని లైన్లో పెట్టాడని ఫిల్మ్ నగర్ టాక్.
ఈ కధకు టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. 'ఆకతాయి' . అన్నట్టు.. ఈ చిత్రంలో రామ్ కు జోడిగా లక్కీ చార్మ్ సమంత ను సంప్రదిస్తున్నట్లు వినిపిస్తోంది. ఈ ఆకతాయి పిల్ల సమంతా రొమాన్స్ తో ఒంగోలు గిత్త లాంటి కుర్రోడు రామ్ కు కలిసి వస్తుందో లేదో చూద్దాం.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more